Share News

IPL 2025-BCCI: ఐపీఎల్‌ రీస్టార్ట్‌.. బీసీసీఐకి కొత్త తలనొప్పి.. ఈజీ కాదు గురూ..

ABN , Publish Date - May 11 , 2025 | 11:54 AM

Indian Premier League: ఇండో-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో ఐపీఎల్-2025ను అర్ధంతరంగా నిలిపివేసింది బీసీసీఐ. అనంతరం క్యాష్ రిచ్ లీగ్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసింది బోర్డు.

IPL 2025-BCCI: ఐపీఎల్‌ రీస్టార్ట్‌.. బీసీసీఐకి కొత్త తలనొప్పి.. ఈజీ కాదు గురూ..
IPL 2025

రసవత్తర పోరాటాలతో ప్రేక్షకులకు మస్తు వినోదం పంచుతున్న ఐపీఎల్-2025 అర్ధంతరంగా ఆగిపోయింది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్‌ను వారం రోజుల పాటు వాయిదా వేసింది భారత క్రికెట్ బోర్డు. దీంతో మిగిలిన ఐపీఎల్ మ్యాచులు నిర్వహిస్తారా.. లేదా.. అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే తాజాగా కాల్పుల విరమణకు ఇండో-పాక్ ఒప్పుకోవడంతో ఐపీఎల్ రీస్టార్ట్‌కు మార్గం సుగమమైంది. ఈ సమయంలో బీసీసీఐకి కొత్త తలనొప్పి షురూ అయింది. వీటిని సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు.


బిగ్ చాలెంజ్

ఐపీఎల్‌ను రీస్టార్ట్ చేసేందుకు భారత క్రికెట్ బోర్డు చకచకా చర్యలు తీసుకుంటోంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇంకా మిగిలి ఉన్న 16 మ్యాచుల నిర్వహణ విషయమై మే11న కీలక సమావేశం నిర్వహించనుంది బోర్డు. వీలైనంత త్వరగా లీగ్‌ను రీస్టార్ట్ చేయడంపై ఈ మీటింగ్‌లో డెసిషన్ తీసుకునే చాన్స్ ఉంది. అయితే ఫారిన్ ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్, సెక్యూరిటీ ఇష్యూస్ లాంటివి బోర్డును ఇబ్బంది పెడుతున్నాయి. టోర్నమెంట్ అర్ధంతరంగా ఆగిపోవడంతో విదేశీ ఆటగాళ్లు, కోచ్‌లు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఐపీఎల్ రీస్టార్ట్ అయితే వాళ్లందర్నీ వెనక్కి తీసుకురావడం బిగ్ చాలెంజ్‌గా మారే డేంజర్ ఉంది.


తిరిగొస్తారా..

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పులు ఆగాయి. అయితే పాక్ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘిస్తూనే ఉంది. మాట తప్పే అలవాటు ఉన్న శత్రుదేశం.. ఇండియాపై మళ్లీ దాడులకు దిగదని చెప్పలేం. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్ కోసం తిరిగి ఇండియాకు వస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒకవేళ ఓవర్సీస్ ప్లేయర్లు రాకపోతే మాత్రం లీగ్ కళతప్పే డేంజర్ ఉంది. దీంతో పాటు ఆటగాళ్ల భద్రత అంశం మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్లేయర్లు ఉండే హోటల్స్, స్టేడియాలకు భారీగా భద్రతను కేటాయించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ సమస్యల్ని బీసీసీఐ పరిష్కరించాల్సి ఉంటుంది. అందుకోసం అటు ఓవర్సీస్ ఆటగాళ్లతో మాట్లాడి వారికి భరోసా ఇవ్వాలి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోనూ చర్చలు జరపాల్సి ఉంటుంది. ఈ తలనొప్పుల నుంచి బోర్డు ఎలా బయటపడుతుందో, లీగ్‌ను ఎలా రీస్టార్ట్ చేస్తుందో చూడాలి.


ఇవీ చదవండి:

కోహ్లీకి నో ఆప్షన్

పాక్ గాలి తీసిన చాహల్

మూడు నగరాల్లోనే మిగిలిన ఐపీఎల్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 11 , 2025 | 11:54 AM