ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Women Coffee Effects: మహిళలు కాఫీ తాగుతున్నారా..? జాగ్రత్త..

ABN, Publish Date - Oct 28 , 2025 | 08:40 AM

కాఫీ, టీలను మనం తరచూ.. తాగుతూ ఉంటాం. అయితే కాఫీ, టీలలో కాఫీకి ఒక ప్రత్యేకమైనా స్థానం ఉంటుంది. కాఫీ రుచి కానీ దాని నుంచి వచ్చే వాసన గాని మనసుకు హత్తుకునే లాగా ఉంటుంది. అయితే కాఫీ రోజు తాగడం వల్ల ప్రయోజనకరంగా ఉన్నప్పటికి.. దీని నుంచి మహిళలు కొంతదూరం ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మహిళలు కాఫీ ఎక్కువ తాగకూడదని సూచిస్తున్నారు. కాఫీలో ఉండే కెఫిన్‌ను మహిళలు ఎక్కువ తీసుకోవడం వల్ల హార్మోన్లకు ఆటంకం కలిగించడంతో పాటు నిద్ర విధానాలకు అంతరాయం కలిగిస్తుందని అంటున్నారు. అలాగే జీర్ణ సమస్యలకు కూడా కెఫిన్ ప్రేరేపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

1/6

ఆందోళన: అధిక కెఫిన్ నాడీ వ్యవస్థను అతిగా ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల ఆందోళన, భయం, వణుకు వంటివి ఏర్పడతాయి.

2/6

నిద్రలేమి: కెఫిన్ నిద్రను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల నిద్రకు భంగం కలగవచ్చు.

3/6

జీర్ణ సమస్యలు: కాఫీ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగినప్పుడు.

4/6

ఎముకల సాంద్రత తగ్గడం: అధిక కాఫీ వినియోగం ఎముకల సాంద్రత తగ్గడానికి కారణం కావచ్చు, ముఖ్యంగా కాల్షియం తగినంతగా తీసుకోని వారికి.

5/6

రక్తపోటు పెరగడం: కాఫీలోని కెఫిన్ రక్తపోటును తాత్కాలికంగా పెంచుతుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.

6/6

చర్మ సమస్యలు: అధిక కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి, చర్మం పొడిబారడం లేదా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. పాల ఉత్పత్తులతో కూడిన కాఫీలు మరింత ఈ సమస్యలను పెంచుతాయి.

Updated Date - Oct 28 , 2025 | 08:48 AM