CM Chandrababu: పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ..
ABN, Publish Date - Sep 28 , 2025 | 06:02 PM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు పరామర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు పరామర్శించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఐదు రోజులుగా పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరంతోనే ఇటీవల ఏపీ అసెంబ్లీ వెళ్లారు. అలాగే తన శాఖలపైనా సమీక్షలు చేశారు. అనంతరం వైద్యులను కలిసి చికిత్స తీసుకున్నారు.
వైద్య పరీక్షలు చేయించుకున్నా కూడా జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ చికిత్స తీసుకున్నట్లు తెలిసింది. ఆయన ఇంకా జ్వరంతోనే బాధపడుతున్నారు. ఈ క్రమంలో పవన్‌ని పరామర్శించడానికి సీఎం చంద్రబాబు ఆయన నివాసానికి చేరుకున్నారు.
Updated Date - Sep 28 , 2025 | 06:59 PM