Secunderabad Ganesh Temple: వినాయక చవితి ఉత్సవాలకు సికింద్రాబాద్ గణేష్ ఆలయం ముస్తాబు
ABN, Publish Date - Aug 22 , 2025 | 07:37 PM
ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు27వ తేదీన వచ్చింది. దీంతో భక్తులు ఏర్పాట్లలో మునిగిపోయారు. గణేష్ చతుర్థి సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నా వినాయక దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. గణేష్ ఉత్సవాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి. వివిధ రంగులతో దేవాలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు27వ తేదీన వచ్చింది. దీంతో భక్తులు ఏర్పాట్లలో మునిగిపోయారు.
ఈ ఏడాది గణేష్ విగ్రహాలు భారీగానే ధర పలుకుతున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే భక్తులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
వివిధ రంగుల విద్యుత్ కాంతులతో గణేష్ ఆలయం
వినాయక చవితికి ముస్తాబు అవుతున్న దేవాలయం
ఆలయంలో పూజలు అందుకుంటున్న వినాయకుడు
గుడిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు
Updated Date - Aug 23 , 2025 | 02:11 PM