ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - Oct 06 , 2025 | 06:35 AM

విజయనగర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ ర్యాలీని మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌ జెండా ఊపి ప్రారంభించారు. పైడిమాంబ ఆలయం నుంచి మూడులాంతర్ల మీదుగా కోట వరకు ర్యాలీ సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఆసక్తిగా తిలకించారు.

1/18

విజయనగర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

2/18

ఈ ఉత్సవాల్లో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లాశ్రీనివాసరావు, కూటమి నేతలు పాల్గొన్నారు.

3/18

మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

4/18

పైడిమాంబ ఆలయం నుంచి మూడులాంతర్ల మీదుగా కోట వరకు ఈ ఈ ర్యాలీ కొనసాగింది.

5/18

మహిళలతో కలిసి మంత్రి అనిత, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు.

6/18

పైడిమాంబ అమ్మవారి కలశాలు, రోలర్‌ స్కేటర్స్‌, తప్పెటగుళ్లు, థింసా నృత్యాలు, కోలాటం, కేరళ వాయిద్యాలు, కర్రసాము, కత్తిసాము, అడుగుల బొమ్మలు, కొమ్మ, కోయ, బిందెల, గరగల డ్యాన్స్‌లు, చెక్క భజనలు, గంగిరెద్దులు, ఖాళీమాతా నృత్యాలు, ఒంటెల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

7/18

అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఆసక్తిగా తిలకించారు.

8/18

చిన్నారుల యుద్ధ విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉత్సవాలు ప్రజల్లో మరింత ఉత్సాహం, ఉత్తేజాన్ని నింపాయి.

9/18

ముఖ్యంగా విజయనగరం వైభవాన్ని చాటిచెప్పే పలు కార్యక్రమాలు, పైడిమాంబ అమ్మవారి కలశాల ప్రదర్శనతో భక్తుల్లో ఆధ్యాత్మికత సంతరించుకుంది.

10/18

ఆదివారం రాత్రి అయోధ్య మైదానంలో జరిన మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమం నిర్వహణకు ఆర్థికంగా సహకరించిన పలువురు దాతలను మంత్రి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదితి సత్కరించారు.

11/18

ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విజయనగరం ఉత్సవాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

12/18

పైడిమాంబ అమ్మవారిని దర్శించుకుంటున్న హోంమంత్రి అనిత

13/18

ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న అనిత

14/18

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు

15/18

ర్యాలీలో పాల్గొన్న ఎన్‌సీసీ విద్యార్థులు

16/18

ఉత్సవంలో కళాకారులు

17/18

ఏర్పాట్లను పరిశీలిస్తున్న నేతలు

18/18

వేడుకలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తదితరులు

Updated Date - Oct 06 , 2025 | 06:49 AM