PM Narendra Modi: సత్యసాయి శత జయంతి ఉత్సవాలు.. పుట్టపర్తి ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ABN, Publish Date - Nov 19 , 2025 | 11:09 AM
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు(బుధవారం) సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి పుట్టపర్తికి వచ్చారు. ఈ క్రమంలో ఉదయం 9-50 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు(బుధవారం) సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చారు.
ఈ క్రమంలో ఉదయం 9-50 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రధాని.
పుట్టపర్తి విమానాశ్రయం వద్ద మోదీని.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
వీరితో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్, జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, ఎంఎస్ రాజు, కందికుంట వెంకటప్రసాద్, బండారు శ్రావణి, దగ్గుపాటి ప్రసాద్, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
అనంతరం ప్రధాని మోదీ పుట్టపర్తి విమానాశ్రయం నుంచి సత్య సాయి మహా సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడానికి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి బాబా ఆలయానికి వెళ్లారు.
సత్యసాయి ఆలయానికి వెళ్తున్న ప్రధాని మోదీ.
సత్యసాయి ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాని మోదీని ఫొటోలు తీస్తున్న అభిమానులు.
సత్యసాయి ఆలయం వద్ద ప్రధాని మోదీ కాన్వాయ్.
తన కాన్వాయ్ నుంచి ప్రజలను అప్యాయంగా పలుకరిస్తున్న ప్రధాని మోదీ.
సత్యసాయి ఆలయం వద్ద ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతున్న కళాకారులు.
ప్రధాని మోదీని ఫొటోలు తీస్తున్న అభిమానులు.
Updated Date - Nov 19 , 2025 | 11:44 AM