తెలంగాణ భవన్‌లో వైభవంగా అయ్యప్పస్వామి మహాపడి పూజ
ABN, Publish Date - Dec 18 , 2025 | 06:48 AM
తెలంగాణ భవన్‌లో అయ్యప్పస్వామి మహాపడి పూజ మహోత్సవం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ఘనంగా విశేష పూజలు నిర్వహించారు.
తెలంగాణ భవన్‌లో అయ్యప్పస్వామి మహాపడి పూజ మహోత్సవం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది.
స్వామివారికి ఘనంగా విశేష పూజలు నిర్వహించారు. అనంతరం (మహాభిక్ష) అన్నదాన కార్యక్రమం జరిగింది.
స్వామియే శరణం అయ్యప్ప.. శరణం శరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్పస్వామి నామస్మరణతో మార్మోగింది.
ఈ మహపడిపూజ మహోత్స వానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మర ణ, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు.
ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హాజరయ్యారు.
Updated Date - Dec 18 , 2025 | 06:52 AM