Home » Telangana Bhavan
కాంగ్రెస్ సర్కార్ బస్తీ దవాఖానాలను కూడా నిర్వీర్యం చేస్తోందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కిట్ పథకాన్ని కూడా ఎందుకు నిలిపివేసిందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతులను రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు.
Kaleshwaram Project: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణకు రావాలంటూ జస్టిస్ చంద్ర ఘోస్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం తెలంగాణ భవన్‌లో హరీష్ రావు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చావును కోరుకుంటారా.. రేవంత్ రెడ్డి.. మీకు సంస్కారం ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తుగ్లక్ చర్యల వల్ల తెలంగాణ పరువు పోతున్నదని, కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడి.. మాట సమర్థించుకుంటున్నారని, కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
KTR: ముఖ్యమంత్రి రేవంత్‌పై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రాన్ని క్యాన్సర్‌తో పోల్చిన భావదారిద్ర్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ పరువును గంగలో కలుపుతున్నారని మండిపడ్డారు.
KCR: బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వచ్చిన సమయంలో కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
Harish rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. దావోస్ దారి ఖర్చులకు నగదు వృధా చేశారాంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ 2025 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరిస్తారు. తర్వాత తనను ఏసీబీ అధికారులు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. గురువారం ఆయన ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు.
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మాటలు మార్చటంలో రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారని.. రెండు కాదు.. మూడో మాట కూడా మార్చగల నేర్పరి అని, పూటకో పార్టీ మార్చటం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, రాక్షసులు అన్న నోటితోనే.. దేవత అని పొగడగల సామర్థ్యం రేవంత్ రెడ్డి సొంతమని విమర్శించారు.