KCR: నన్ను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం
ABN , Publish Date - Dec 21 , 2025 | 03:14 PM
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government), సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( Kalvakuntla Chandrasekhar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేతలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో గులాబీ బాస్ మాట్లాడారు. తనను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు.
తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ (CM Revanth Reddy) విధానమా అని ప్రశ్నల వర్షం కురిపించారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పుకొచ్చారు. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలైతే మన సత్తా తెలిసేదని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేకత సృష్టంగా కనిపించిందని తెలిపారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని కేసీఆర్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అహంకార వైఖరి ప్రదర్శించలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఒక్క కొత్త పాలసీ కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఉన్న పథకాలను కూడా ఆపేశారని ధ్వజమెత్తారు. తాము తీసుకువచ్చిన పాలసీ రియల్ ఎస్టేట్ కోసమేనని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని అన్నారు. ఒకప్పుడు యురియా ఇంటికి, చేను దగ్గరకు వచ్చేదని వివరించారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్‌లో యూరియా కోసం కుటుంబమంతా లైన్‌లో ఉండే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అందుకే కేసీఆర్ బయటకు వచ్చారు.. మధుయాష్కీ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..
Read Latest Telangana News and National News