Madhuyashki Goud: అందుకే కేసీఆర్ బయటకు వచ్చారు.. మధుయాష్కీ షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 21 , 2025 | 03:29 PM
కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడం వల్ల ఎలాంటి లాభం లేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గిచుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై (KCR) మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ (Madhuyashki Goud) షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్‌కి ఫాంహౌస్‌లో చలి పెడుతోందని.. అందుకే బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. ఇవాళ(ఆదివారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మధుయాష్కీ గౌడ్ మాట్లాడారు. కేసీఆర్ సభ పెడుతున్న తెలంగాణ భవన్‌కు స్థలం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుచేశారు. కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావడం వల్ల ఎలాంటి లాభం లేదని విమర్శించారు.
కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గిచుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంపై కేటీఆర్‌కు ఆయన తండ్రి కేసీఆర్ హితబోధ చేయాలని హితవు పలికారు. నది జలాలపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కి ఎక్కడుందని ప్రశ్నల వర్ష కురిపించారు. పక్క రాష్ట్రానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గర సరెండర్ అయింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి అద్భుతమైన పాలన కొనసాగిస్తున్నారని మధుయాష్కీ గౌడ్ ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నన్ను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం
హైదరాబాద్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం.. అట్లకాడతో కాల్చి..
Read Latest Telangana News and National News