Women Empowerment Conference: తిరుపతిలో మహిళా సాధికారత సదస్సు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు
ABN, Publish Date - Sep 15 , 2025 | 06:51 AM
తిరుపతిలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో మహిళా సాధికారిక సదస్సు జరగడం మంచి పరిణామమని వారు ఉద్ఘాటించారు.
ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి.. జాతీయ మహిళా సాధికారత సదస్సుకు వేదికగా నిలిచింది.
దేశ నలుమూలల నుంచి మహిళా సాధికారత కమిటీ ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రముఖులు హాజరవడంతో తిరుపతి ఒక చారిత్రక ఘట్టానికి ఆతిథ్యమిచ్చింది.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ‘వికసిత్ భారత్‌కు మహిళల నాయకత్వం’ అనే నినాదంతో నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సు ఆదివారం రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమైంది.
చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు, ఇబ్బందులు.. వాటిని అధిగమించడంలో మహిళా సాధికారత పాత్రపై చర్చించారు.
‘మన కుమార్తెలు చదువుకొని స్వయం ఆధారితులైతేనే భారతదేశం సమగ్ర, అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది’ అని ఓం బిర్లా ఉద్ఘాటించారు.
ఓం బిర్లాతో కరచాలనం చేస్తున్న అయ్యన్న పాత్రుడు
మహిళా సాధికారత సదస్సులో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మహిళా ప్రతినిధులు
మహిళా సాధికారత సదస్సు ప్రారంభిస్తున్న ఓం బిర్లా, తదితరులు
మహిళా సాధికారత సదస్సులో బీజేపీ ఎంపీ డీకే అరుణ, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
మహిళా సాధికారత సదస్సులో కూటమి నేతలు
మహిళా సాధికారత సదస్సులో ఏర్పాటు చేసిన మెడికల్ స్టాల్
మహిళా సాధికారత సదస్సు సందర్భంగా బందోబస్తులో పాల్గొన్న పోలీసులు
మహిళా సాధికారత సదస్సులో మహిళా ప్రతినిధులు
Updated Date - Sep 15 , 2025 | 06:58 AM