NRI News: తానా ఆధ్వర్యంలో ఛార్లెట్‌లో ఫుడ్ డ్రైవ్.. సక్సెస్
ABN, Publish Date - Dec 21 , 2025 | 10:07 PM
ఛార్లెట్‌లోని రూఫ్ అబోవ్ షెల్టర్ వద్ద ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో సుమారు 200 మందికి పిజ్జా, వింగ్స్, సోడాతో కూడిన ఆహారాన్ని అందించారు. దీనితో పాటు 1,000 పౌండ్ల బరువున్న 400 క్యాన్డ్ ఫుడ్ ఐటమ్స్ బ్యాగులను విరాళంగా అందజేశారు.
వాషింగ్టన్: ఛార్లెట్‌లోని రూఫ్ అబోవ్ షెల్టర్ వద్ద ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో సుమారు 200 మందికి పిజ్జా, వింగ్స్, సోడాతో కూడిన ఆహారాన్ని అందించారు. దీనితో పాటు 1,000 పౌండ్ల బరువున్న 400 క్యాన్డ్ ఫుడ్ ఐటమ్స్ బ్యాగులను విరాళంగా అందజేశారు. ఛార్లెట్‌లోని తానా నాయకులు, యువ వలంటీర్లు విశేష కృషితో ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. యువ వలంటీర్లు హాసిని మల్లెల, ప్రణవ్ మల్లినేని, కీర్తన కొత్తపల్లి, కార్తికేయ మల్లెల, రోషన్ వడ్లమూడి, గణిత్ బోడిపూడి, అఖిల్ చెరుకూరితోపాటు పలువురికి తానా నాయకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
అవసరంలో ఉన్న వారికి సేవ చేయడంలో వీరు చూపిన కృషి, పట్టుదల ప్రశంసనీయమని తానా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తమ వంతు సహాయ సహకారాలను అందించిన కిషోర్ బోడిపూడి, కిరణ్ యార్లగడ్డకు సైతం తానా నాయకులు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తానా నాయకులు రవి (నాని) వడ్లమూడి ‘అప్పలాచియన్ రీజినల్ రిప్రజెంటేటివ్’, నాగ పంచుమర్తి ‘స్పెషల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్’, కిరణ్ కొత్తపల్లి ‘టీమ్ స్క్వేర్ చైర్’ మాధురి యెలూరి ‘హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్’, టాగూర్ మల్లినేని ‘తానా ఫౌండేషన్ ట్రస్టీ’ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఛార్లెట్‌లోని తానా నాయకులు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి తమ మార్గ దర్శకత్వాన్ని, నిరంతర మద్దతును అందించిన తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేనిలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే దాతలు, తల్లిదండ్రులకు, స్వచ్ఛంద సేవకులకు ఈ కార్యక్రమాన్ని ఇంతటి అర్థవంతమైన విజయంగా మార్చిన కమ్యూనిటీ సభ్యులందరికీ కూడా నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విలువ కోల్పోతున్న శాలువా సత్కారాలు
సుందర్ పిచాయ్‌తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ
Updated Date - Dec 21 , 2025 | 10:09 PM