Share News

Nara Lokesh Meets Sundar Pichai: సుందర్ పిచాయ్‌తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ

ABN , Publish Date - Dec 10 , 2025 | 07:30 AM

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

Nara Lokesh Meets Sundar Pichai: సుందర్ పిచాయ్‌తో ఏపీలో టెక్ పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చర్చ
Nara Lokesh Meets Sundar Pichai

ఇంటర్నెట్ డెస్క్, డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి): గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో (Sundar Pichai) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రోన్ సిటీలో అసెంబ్లీంగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే (గ్లోబల్ నెట్ వర్కింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) హాజరయ్యారు.


విశాఖపట్నంలో $15బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనుల ప్రారంభం, అమలుపై చర్చించారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ – సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, క్యాలీబ్రేషన్, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.


భారత్‌లో క్లౌడ్ రీజియన్‌ల విస్తరణతోపాటు ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్’ ద్వారా స్టార్టప్‌లకు మద్దతు ఇస్తునట్లు తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్ ప్రకటించిన $15 బిలియన్ విలువైన ఏఐ డేటా సెంటర్ అమెరికా వెలుపల అతిపెద్ద ఎఫ్‌డీఐ కానుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్టు మాన్యుఫ్యాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు వింగ్స్ తయారవుతున్నాయని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.


గూగుల్ ఉత్పత్తులను ప్రతి నెలా 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశానికి బికాశ్ కోలే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ నెట్ వర్కింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, థామస్ కురియన్ సీఈఓ గూగుల్ క్లౌడ్ హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన

ఏపీలో ఇంటెల్ ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయండి: మంత్రి నారా లోకేశ్

Read Latest and NRI News

Updated Date - Dec 10 , 2025 | 07:43 AM