Share News

Minister Nara Lokesh: పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన

ABN , Publish Date - Dec 07 , 2025 | 08:03 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఏపీలో పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే అమెరికాలోని డల్లాస్‌లో పర్యటిస్తున్నారు.

Minister Nara Lokesh: పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన
Minister Nara Lokesh

ఇంటర్నెట్ డెస్క్, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఏపీలో పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే అమెరికాలోని డల్లాస్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా నిన్న (శనివారం) ఉదయం డల్లాస్‌కు లోకేశ్ చేరుకున్నారు. ఆయనకు ఎన్నారై తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి అభిమానులు ఘన స్వాగతం పలికారు.

DALLAS-2.jpg


శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి) లోకేశ్ డల్లాస్ పరిసర ప్రాంతమైన గార్లాండ్‌లో ప్రవాసాంధ్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినందుకు ప్రవాసాంధ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపేందుకు ఈ వేదికను వినియోగించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారికి ఉచిత భోజనంతో పాటు లోకేశ్‌తో ఫొటో దిగే అవకాశం కల్పిస్తున్నారు.

DALLAS-1.jpg


ఏపీ ఎగుమతులు - దిగుమతుల వాణిజ్యాన్ని బలోపేతం చేసే పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో లోకేశ్ సోమ, మంగళవారాల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తారు. ఆయన పర్యటన ఏర్పాట్లను ఏపీ ఎన్ఆర్‌టీ చైర్మన్ డా.వేమూరు రవికుమార్, ఎన్నారై టీడీపీ సమన్వయకర్త కోమటి జయరాం, ఎన్నారై లోకేశ్ నాయుడు కొణిదెల, రాజాపిల్లి, సతీష్ మండువ, తదితరులు సమన్వయపరుస్తున్నారు.

DALLAS.jpg


లోకేశ్‌కు స్వాగతం పలికిన వారిలో రామ్ యలమంచిలి, మండువ సురేశ్, నవీన్ యర్రమనేని, సుధీర్ చింతమనేని, సుగణ్ చాగర్లమూడి, సూరపనేని రాజా (సెయింట్ లూయిస్), గుదె పురుషోత్తం చౌదరి (నార్త్ కరోలినా), యాశ్ బొద్దులూరి (వర్జీనియా), సాయి బొల్లినేని (నార్త్ కరోలినా), గొర్రెపాటి చందు (బోస్టన్), జిల్లెళ్లమూడి వెంకట్ (డల్లాస్), చండ్ర దిలీప్, జాస్తి శ్రీతేజ, సాయి మద్దిరాల, తదితరులు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్.. అమెరికాలో లోకేశ్ విస్తృత పర్యటన

ప్రియమైన ఎన్నారై టీడీపీ సైనికులారా కదలిరండి: జయరామ్ కోమటి

Read Latest and NRI News

Updated Date - Dec 07 , 2025 | 08:44 AM