-
Boston: బోస్టన్‌లో నేషనల్ శాసనసభ్యులు కాన్ఫరెన్స్.. ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రాతినిధ్యం..
ABN, Publish Date - Aug 06 , 2025 | 08:21 PM
అమెరికన్ లోని బోస్టన్ ఎమ్మెల్యేల సమ్మేళానానికి ఉభయ తెలుగు రాష్ట్రాల తరపున ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా NRI టీడీపీ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
MLA Ravi Kumar USA: అమెరికాలో ని బోస్టన్ నగరంలో ఈ సంవత్సరం నేషనల్ శాసనసభ్యులు కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆముదాలవలస ఎమ్మెల్యే, ఇంజినీర్ కూన రవి కుమార్ ప్రాతినిధ్యం వహించారు. భారతదేశం నుంచి 165 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కాగా, ఈ సభకి మన ఉభయ తెలుగు రాష్ట్రాల తరపున ఎమ్మెల్యే రవి కుమార్ ఒక్కరే విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన బోస్టన్‌లో ప్రవాసాంధ్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. NRI టీడీపీ బోస్టన్ మహానగరంలో 2022 మహానాడు ను దిగ్విజయముగా జరిపిన ఎన్ఆర్ఐ టీడీపీ న్యూ ఇంగ్లాండ్ పసుపుదళాన్ని కలుసున్నారు.
ఈ సమావేశంలో అంకినీడు ప్రసాద్ తెలుగు తమ్ముళ్లని ఆహ్వానించారు. సూర్య తేలప్రోలు మాట్లాడుతూ గత ఎన్నికలల్లో లక్షల్లో దొంగ ఓట్లను ఎలా తీసివేసింది సభికులు అందరకి పూసగుచ్చినట్టు విశదీకరించారు. S4 మీడియా అధినేత శ్రీ బోళ్ల ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు అధ్యక్షతన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, పారదర్శకంగా పనిచేస్తున్న తీరుని కొనియాడారు. సభలో పలువురు తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా ప్రసంగించారు. కుటమి ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా ఉండాలని కృష్ణప్రసాద్ సోంపల్లి వివరించారు.
ఎమ్మెల్యే కూన రవి కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషిని యావత్ ప్రపంచం కొనియాడుతోందని అన్నారు. శ్రీకాకుళం లో ఎన్ఆర్ఐలు ఇండస్ట్రీస్ కారిడార్ కు దోహద పడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తమ ఉద్దేశమని చెప్పారు. తెలుగు తమ్ముళ్లు అందరూ ఇప్పటవరుకు చేసిన కృషిని మెచ్చుకొంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములై తమవంతు కృషి చేయాలి అని కోరారు. చివరగా వేణు కునమనేని వచ్చిన తెలుగు తమ్ములందరికి కృతజ్ఞతలు తెలిపారు.
చక్కటి విందు తోటి ముగిసిన ఈ సమావేశంలో సంపత్ కట్ట, విజయ్ బెజవాడ,త్రిభువన్ పారుపల్లి, గోపి నెక్కలపూడి, శేషుబాబు కొంతం, రాజేందర్, కృష్ణ ప్రసాద్ సోంపల్లి, కళ్యాణ్ కాకి, రవి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రియాద్ హైదరాబాదీ హోటళ్ళలో మరో తలమానికం.. పీకాక్ కొత్త బ్రాంచ్..
అమెరికాలో నలుగురు భారత సంతతి వృద్ధుల అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసులు గాలింపు
For More NRI News And Telugu news
Updated Date - Aug 07 , 2025 | 03:05 PM