Share News

Peacock Restaurant: రియాద్ హైదరాబాదీ హోటళ్ళలో మరో తలమానికం.. పీకాక్ కొత్త బ్రాంచ్..

ABN , Publish Date - Aug 06 , 2025 | 06:07 PM

సౌదీ అరేబియా రాజధానికి కరీంనగర్ బిర్యానీ ఘుమఘుమలు పాకాయి. రియాద్‌లో హైదరాబాదీ హోటళ్లలో తలమానికంగా భావించే పీకాక్ రెస్టరెంట్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ప్రవాస భారతీయులకు మాతృభూమి రుచులను అందించేందుకు సిద్ధమవుతోంది.

Peacock Restaurant: రియాద్ హైదరాబాదీ హోటళ్ళలో మరో తలమానికం.. పీకాక్ కొత్త బ్రాంచ్..
Karimnagar Peacock Restaurant in Riyadh

Peacock Restaurant in Riyadh: మాతృభూమికి సుదూరాన ఉన్నప్పటికీ నోరూరించే సంప్రదాయ రుచులు ప్రతి మనిషిని మైమరపిస్తాయి. సొంతూరిలో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. ఈ రకమైన భోజనాలను అందించే రెస్టరెంట్లలో ప్రముఖ పీకాక్ రెస్టారెంట్ ముందు వరసలో నిలుస్తుంది. విదేశీ గడ్డపై భారతీయ సంప్రదాయ మూలాలను గుర్తుచేసే ఇలాంటి హోటళ్లు తోటి భారతీయులను ఒకరితో మరొకరిని అనుసంధానం చేసే కేంద్రాలని చెప్పడం అతియోశక్తి కాదు.


భారతీయ వంటకాలలో హైదరాబాద్ బిర్యానీకి ఉన్న ప్రాధాన్యత గూర్చి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నవాబుల కాలం నుంచి భోజన ప్రియులకు ఎంతో ప్రియమైన ఈ వంటకాన్ని విదేశాల్లోనూ ఇష్టంగా ఆరగిస్తారు. ప్రవాసాంధ్రులతో పాటు భారతీయులు, దక్షిణాసియా వాసులు ఎక్కువగా ఉన్న గల్ఫ్ దేశాలలో.. హైదరాబాదీ బిర్యానీ ఘనమైన హైదరాబాదీ ఆహార సంప్రదయాలను ప్రతిబింబిస్తోంది. శరవేగంగా పెరుగుతున్న ఉపాధి వలసల కారణాన ఒక్క భారతీయులే కాదు. ప్రపంచీకరణ నేపథ్యంలో అరబ్బులు కూడా హైదరాబాదీ బిర్యానీపై మక్కువ ప్రదర్శిస్తున్నారు. కుటుంబాలతో సహా వచ్చి హైదరాబాదీ బిర్యానీని ఆస్వాదిస్తున్నారు.

dining.jpg


ప్రవాసాంధ్రులు అధికంగా నివసిస్తున్న సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో ప్రముఖ హోటల్లకు దీటుగా ఎన్నో బిర్యానీ రెస్టరెంట్లు ఉన్నాయి. పెరుగుతున్న భారతీయుల సంఖ్యకు తగినట్లుగా భారతీయ రెస్టరెంట్లు ప్రత్యేకించి హైదరాబాదీ హోటళ్ళు కూడ ఎడారినాట వర్ధిల్లుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా నివసించె హారా, మలాజ్ ప్రాంతాలలో డజన్ల సంఖ్యలో హైదరాబాదీ హోటళ్ళు ఉండగా.. ఇప్పుడు ఏకంగా కరీంనగర్ బ్రాండ్ హోటళ్ళు కూడా భారీ స్ధాయిలో అరబ్బు దేశాలకు తమ బ్రాంచ్‍‌లను విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ నగరంలో ప్రఖ్యాతి చెందిన పీకాక్ రెస్టరెంట్ అంతర్జాతీయ కార్యకలాపాల విస్తరణలో భాగంగా తన మొదటి శాఖను సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ప్రారంభించింది.

room.jpg


సగటు హైదరాబాదీ రెస్టరెంట్ల కంటె భిన్నంగా.. సువిశాల వైశాల్యంలో విలాసవంత సౌకర్యాలతో నగరం నడిబొడ్డులోని మలాజ్ ప్రాంతంలో పీకాక్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. భారతీయ బాలికల పాఠశాల సమీపంలోనే ఉన్న పీకాక్ రెస్టరెంట్ ను శుక్రవారం భారతీయ రాయబారి డాక్టర్ సోహేల్ ఏజాస్ ఖాన్ ప్రారంభించనున్నారు.

seating.jpg


తెల్లవారు జామున ఇడ్లీ, దోశ తదితర అల్పాహారాలు నుంచి మొదలుకుని రాత్రి బిర్యానీ, కబాబుల వరకు అన్ని రకాల భారతీయ వంటకాలను తాము వడ్డీస్తామని దీని యాజమాని సయ్యద్ వాయిజ్ అహ్మద్ వెల్లడించారు. ఏకకాలంలో 120 మంది డైనింగ్ సామర్థ్యంతో పాటు 150 మంది అతిథుల సామర్థ్యంతో కలిగిన బాంకెట్ హాలు కూడ ఉందని ఆయన పేర్కొన్నారు. తమ హోటల్ లో ఏ రకమైన శుభ కార్యాన్ని అయినా ప్రవాసీ కుటుంబాలు నిర్వహంచుకోవచ్చని వాయిజ్ అహ్మద్ చెప్పారు.

owners.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

క్రీడాస్ఫూర్తే యువత ఉన్నతికి తొలిమెట్టు
అమెరికాలో నలుగురు భారత సంతతి వృద్ధుల అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసులు గాలింపు

For More NRI News And Telugu news

Updated Date - Aug 06 , 2025 | 06:40 PM