Share News

AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు PLR సంస్థ ప్రతినిధులు

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:44 PM

లిక్కర్ స్కాం కేసులో PLR సంస్థ ఖాతాల్లోకి డబ్బు బదిలి అయినట్లు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది. ఈ విషయంపై PLR ప్రాజక్ట్స్ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సిట్ అధికారులు.

AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు PLR సంస్థ ప్రతినిధులు
MP Mithun Reddy

విజయవాడ : లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాం కేసులో సిట్ ఎదుట విచారణకు PLR ప్రాజెక్ట్స్ ఎండి చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివా రెడ్డి హాజరయ్యారు. లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత PLR సంస్థ ప్రతినిధులను విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు వారు ఇవాళ(బుధవారం) విచారణకు హాజరయ్యారు.


లిక్కర్ స్కాం కేసులో PLR సంస్థ ఖాతాల్లోకి డబ్బు బదిలి అయినట్లు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది. ఈ విషయంపై PLR ప్రాజెక్ట్స్ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సిట్ అధికారులు.


లిక్కర్ స్కామ్‌ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నిన్న వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఈ నెల 12వ తేదీ బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే లిక్కర్ స్కామ్‌ కేసులో ఏ4గా మిథున్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో అరెస్టయిన ఆయన.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా

విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్

Updated Date - Aug 06 , 2025 | 04:50 PM