Mallu Bhatti Vikramarka: బీసీ బిల్లుతో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుంది : భట్టి విక్రమార్క
ABN , Publish Date - Aug 06 , 2025 | 05:21 PM
బీసీ బిల్లుకు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు జరిగితే.. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని తెలిపారు.
ఢిల్లీ: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. బిల్లు ఆమోదం కోసం నినాదాలు చేస్తూ.. జంతర్ మంతర్ వద్ద బైఠాయించారు.ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.
బీసీ బిల్లుకు రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు జరిగితే.. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేయగలరా.. అని ప్రశ్నించిన ప్రతిపక్షాలకు కులగణన చేసి చూపెట్టారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో సైంటిఫిక్‌గా సర్వే చేసినట్లు చెప్పుకొచ్చారు. బిల్లు అమలు అయితే.. 42 శాతం విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఆమోదం తెలుపాల్సిందే అని డిమాండ్ చేశారు. ఈ బిల్లుతో ఓబీసీల కల నెరవేరాలని ఆకాంక్షిస్తున్నట్లు భట్టి చెప్పారు.
బీసీ రిజర్వేషన్ల కల్పనలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భట్టి మండిపడ్డారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు జరగకుండా.. బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ముస్లింల పేరుతో బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని భట్టి విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్