Share News

Mahua Moitra: మహువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహ విందు.. బహు పసందు

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:37 PM

మహువా మొయిత్రా(50), పినాకి మిశ్రా(65) వివాహ విందు ఢిల్లీలో సందడి సందడిగా సాగింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ ప్రముఖులు..

Mahua Moitra: మహువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహ విందు.. బహు పసందు
Mahua Moitra, Pinaki Misra

ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా - బిజు జనతాదళ్ (BJD) మాజీ ఎంపీ పినాకి మిశ్రా వివాహ విందు సందడి సందడిగా సాగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ వర్గాల నాయకులు హాజరయ్యారు. మే 30న జర్మనీలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో మొయిత్రా - మిశ్రా జంట వివాహం చేసుకున్న రెండు నెలల తర్వాత హస్తినలోని హోటల్ లలిత్‌లో రిసెప్షన్ కార్యక్రమం నిర్వహించారు.

Late-wed.jpgహస్తినలో జరిగిన రిసెప్షన్‌లో, శ్రీమతి మొయిత్రా బంగారు ఎంబ్రాయిడరీ, ఇంకా సాంప్రదాయ బంగారు ఆభరణాలు ధరించి ఎరుపు చీరలో కనిపించారు. శ్రీ మిశ్రా ఎరుపు ఎంబ్రాయిడరీ బార్డర్‌తో కూడిన క్లాసిక్ తెల్లటి సాంప్రదాయ దుస్తులు ధరించారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రంజీత్ రంజన్ సహా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, ఎంపీలు, అనేక మంది ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు.

Sonia-in-reception.jpg


పార్లమెంటరీ ప్రసంగాలకు పేరుగాంచిన శ్రీమతి మొయిత్రా, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ నుండి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక, సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది, సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన మిశ్రా, 1996లో కాంగ్రెస్ టికెట్‌పై పూరీ నుండి మొదటిసారి లోక్‌సభలోకి ప్రవేశించారు.

ఇక, సోషల్ మీడియాలో మొయిత్రా - మిశ్రా పెళ్లి విందు ఫొటోలు షేర్ చేస్తూ నేతలు కొత్త జంటకి తమ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వధువు మొయిత్రా వయస్సు ఇప్పుడు 50ఏళ్లు కాగా, వరుడు పినాకి మిశ్రా వయస్సు 65 సంవత్సరాలు.

Updated Date - Aug 06 , 2025 | 04:50 PM