ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Stalin: ఊటీలో సీఎం స్టాలిన్‌.. నాలుగు రోజులు అక్కడే మకాం

ABN, Publish Date - May 13 , 2025 | 11:47 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఊటీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నాలుగు రోజులు ఊటీలోనే ఉండనున్నారు. చెన్నై నుంచి కోవై విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా.. ఊటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు పంపిణీ చేస్తారు.

చెన్నై: ఐదురోజుల పర్యటన నిమిత్తం నీలగిరి జిల్లా ఊటీకి వెళ్ళిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)కు దారి పొడవునా పార్టీ శ్రేణులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఊటీ వేసవి ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమైన ఫ్లవర్‌ షోను ఈ నెల 15న సీఎం ప్రారంభించనున్నారు. దీంతోపాటు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం సోమవారం చెన్నై నుంచి విమానంలో బయలుదేరి కోవై విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Eshwarappa: నా గొంతుకోసినా.. పార్టీ మాత్రం మారను


విమానాశ్రయం వద్ద డీఎంకే జిల్లా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తర్వాత స్టాలిన్‌ కారులో ఊటీ బయలుదేరారు. ఊటీ చేరుకున్న ఆయనకు నీలగిరి జిల్లా నాయకులు, కార్యకర్తలు కొత్తగిరి, కట్టపెట్టు ఊటీ చేరింగ్‌క్రాస్‌ తదితర ప్రాంతాల వద్ద ఘనస్వాగతం పలికారు. ఊటీ ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న స్టాలిన్‌ అక్కడే రాత్రి బసచేశారు. మంగళ, బుధవారాల్లో ఊటీ తదితర ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని వివిధ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు పంపిణీ చేస్తారు.


15న బొటానికల్‌ గ్రౌండ్‌లో 127 ఫ్లవర్‌షో ప్రారంభిస్తారు. ఈ నెల 16న ఊటీ నుంచి కారులో కోయంబత్తూరు విమానాశ్రయానికి చేరుకుని, విమానంలో నగరానికి విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని నీలగిర జిల్లా అంతటా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు

Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్‌

టోపీ పెట్టుకున్న కోడెనాగు..

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2025 | 11:47 AM