Eshwarappa: నా గొంతుకోసినా.. పార్టీ మాత్రం మారను
ABN , Publish Date - May 13 , 2025 | 11:19 AM
నా గొంతుకోసినా.. పార్టీ మాత్రం మారే ప్రసక్తే లేదని మాజీమంత్రి ఈశ్వరప్ప పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. నేను వేరే పార్టీ పెట్టబోనని, అలాగే తానెందుకు కొత్తపార్టీ పెడతానన్నారు. దీనిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.

- కొత్త పార్టీ ఆలోచన లేదు
- మాజీ డీసీఎం ఈశ్వరప్ప
బెంగళూరు: గొంతు కోసినా పార్టీ మారేది లేదని... కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదని మాజీ డీసీఎం, ఒకప్పటి బీజేపీ ముఖ్యనాయకుడు ఈశ్వరప్ప(Eshwarappa) తేల్చి చెప్పారు. విజయపురలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన వేటుకు గురైన ఎమ్మెల్యే యత్నాళ్‌తో కలసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా..? అనే ప్రశ్నకు సమాధానంగా ఎప్పటికీ వేరే పార్టీకి వెళ్లనని, కొత్త పార్టీ తానెందుకు పెడతానన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Cyber Attacks: భారత్‌పై 15 లక్షల సైబర్ అటాక్స్ చేసిన పాక్..
యత్నాళ్ రాజకీయ పార్టీ ఏర్పాటు విషయం తెలియదన్నారు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం వచ్చేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణమన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినా కదన విరామాన్ని కేవలం మూడు గంటల్లోనే పాకిస్థాన్ ఉల్లంఘించిందన్నారు. పాకిస్థాన్‌లో నీరు, ఆహారం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇదే తరహాలో కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Maoists: గిరిజనుడిని హత్య చేసిన మావోయిస్టులు
Secret War Manual: యుద్ధంలో నడిపించిన రహస్య గైడ్
Read Latest Telangana News and National News