Cyber Attacks: భారత్‌పై 15 లక్షల సైబర్ అటాక్స్ చేసిన పాక్..
ABN , Publish Date - May 13 , 2025 | 08:55 AM
Cyber Attacks: ఎవ్వరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో సైబర్ అటాక్స్‌కు పాల్పడుతోంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు దేశ వ్యాప్తంగా 15 లక్షల సైబర్ అటాక్స్ జరిపినట్లు తేలింది.

భారత్‌ను దెబ్బ తీయడానికి పాక్ అన్ని రకాలుగా కుట్రలు చేస్తూనే ఉంది. ఓ వైపు పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ .. సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతూ ఉంది. మరో వైపు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమయాక భారతీయుల్ని పొట్టనపెట్టుకుంటూ ఉన్నారు. ఈ రెండు రకాలుగానే కాకుండా .. మూడో రకంగా కూడా భారత్‌ను దెబ్బ తీయడానికి పాక్ కుట్రలు చేస్తూనే ఉంది. ఎవ్వరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో సైబర్ అటాక్స్‌కు పాల్పడుతోంది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు దేశ వ్యాప్తంగా 15 లక్షల సైబర్ అటాక్స్ జరిపినట్లు తేలింది.
మహారాష్ట్ర సైబర్ డీబంక్డ్‌కు చెందిన సీనియర్ అధికారి పాకిస్తాన్ సైబర్ అటాక్స్‌పై స్పందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాతినుంచి భారత్‌పై పాక్ హ్యాకర్ల సైబర్ అటాక్స్ పెరిగాయి. ఇప్పటి వరకు 15 లక్షల సైబర్ అటాక్స్ జరిగాయి. వీటిలో 150 సైబర్ అటాక్స్ విజయవంతం అయ్యాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఈ సైబర్ దాడులు ఆగలేదు. భారత ప్రభుత్వానికి చెందిన వెబ్ సైట్లను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి.
కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు.. బంగ్లాదేశ్, ఇండోనేషియా, మొరాక్కో నుంచి కూడా సైబర్ దాడులు జరుగుతున్నాయి. ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్‌నేషనల్ ఏయిర్‌పోర్టుకు సంబంధించిన డేటాను హ్యాకర్లు దొంగలిస్తూ ఉన్నారు. అంతేకాదు.. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌ను కూడా టార్గెట్ చేశారు. కాల్పుల విరమణ తర్వాత సైబర్ అటాక్స్ తగ్గాయి. కానీ, పూర్తిగా ఆగలేదు. పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న వారే సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు తేలింది. మాల్వేర్ క్యాంపైన్స్, డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్(డీడీఓఎస్), జీపీఎస్ స్పూఫింగ్ వంటి సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
Viral Video: కామాంధుడికి చుక్కలు చూపించిన మహిళ.. నడిరోడ్డులో చెప్పుతో..
Ceasefire Agreement: ఒప్పందం జరిగినా మారని పాక్ బుద్ధి.. వరుసగా 3వ రోజు దాడులు