Viral Video: కామాంధుడికి చుక్కలు చూపించిన మహిళ.. నడిరోడ్డులో చెప్పుతో..
ABN , Publish Date - May 13 , 2025 | 07:55 AM
Viral Video: నడిరోడ్డులో అతడ్ని చెప్పుతో చావగొట్టింది. ఏకంగా అతడిపై 20 సార్లకు పైనే దాడి చేసింది. ఈ దాడిని చూస్తున్న జనం నవ్వుకున్నారే గానీ, ఆ వ్యక్తిని విడిపించడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవటం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆడవాళ్లపై అరాచకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొందరు కామాంధులు చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలివాళ్ల వరకు ఎవరినీ వదలటం లేదు. ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా.. శిక్షలు పడుతున్నా ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తించే వారిలో ఎలాంటి మార్పు రావటం లేదు. తాజాగా, తన కూతుర్ని వేధించిన ఓ వ్యక్తికి మహిళ సరైన విధంగా బుద్ధి చెప్పింది. నడిరోడ్డులో అతడ్ని చెప్పుతో చావగొట్టింది. ఏకంగా అతడిపై 20 సార్లకు పైనే దాడి చేసింది. ఈ దాడిని చూస్తున్న జనం నవ్వుకున్నారే గానీ.. ఆ వ్యక్తిని విడిపించడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవటం గమనార్హం.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, హమీపూర్‌లోని ముస్కారా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి.. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికపై కన్నేశాడు. గత కొద్దిరోజుల నుంచి బాలికను వేధిస్తూ ఉన్నాడు. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువవటంతో బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. ఆగ్రహానికి గురైన తల్లి.. కూతుర్ని వెంట బెట్టుకుని ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లింది. అతడిని సమీపించగానే బూతులు తిడుతూ చెప్పు తీసి కొట్టడం మొదలెట్టింది. 9 సెకన్లలో అతడిపై 15 సార్లు చెప్పుతో దాడి చేసింది.
నడి రోడ్డులో ఆమె చెప్పుతో కొడుతుండటంతో ఆ వ్యక్తి అల్లాడిపోయాడు. విడిచి పెట్టమని ఆమెను బ్రతిమాలాడు. అయినా ఆమె వదల్లేదు. అతడ్ని చెప్పుతో చావగొట్టింది. దాదాపు 23 సార్లు చెప్పుతో కొట్టింది. ఆ వ్యక్తి తలను, ముఖాన్ని టార్గెట్ చేసి దాడికి పాల్పడింది. చుట్టూ ఉన్న జనం తోలు బొమ్మల ఆటను చూసినట్లు చూశారే తప్ప విడిపించడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ మహిళపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Ceasefire Agreement: ఒప్పందం జరిగినా మారని పాక్ బుద్ధి.. వరుసగా 3వ రోజు దాడులు