ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం

ABN, Publish Date - May 05 , 2025 | 06:37 PM

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి వేళ.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయాన్ని భారత్ తీసుకుంది.

న్యూఢిల్లీ, మే 05: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్‌కు కట్టడి చేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఆ దేశంతో జల యుద్ధానికి భారత్ శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా చీనాబ్ నదిపై జల విద్యుత్ ప్రాజెక్టులకు మళ్లీ జీవం పోయాలని నిర్ణయించింది. ఆ క్రమంలో జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో జల విద్యుత్ ప్రాజెక్టుల పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. దీంతో పాక్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో కీలక ముందడుగు వేసినట్లు అవుతోంది.


ఈ ప్రాజెక్టుల ద్వారా భారత్‌లో తన నదులపై హక్కులను బలోపేతం చేసుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనవి.. బర్సర్ డ్యామ్ (Bursar Dam), కిరు డ్యామ్ (Kiru Dam), కిర్థాయ్ డ్యామ్ (Kirthai Dam), రాట్లే డ్యామ్ (Ratle Dam), పాకల్ దుల్ డ్యామ్ (Pakal Dul Dam), సావల్కోట్ డ్యామ్ (Sawalkot Dam) ఉన్నాయి. ఈ ఆరు ప్రాజెక్టులు పూర్తయితే.. జమ్మూ కాశ్మీర్‌కు 10,000 మెగావాట్ల విద్యుత్తు అందనుంది.


అంతేకాకుండా.. మైదాన ప్రాంతాలలో నీటిపారుదలతోపాటు గృహ వినియోగానికి సంబంధించి అధిక నీరు అందుబాటులోకి రానుంది. ఈ ఆరు ప్రాజెక్టుల పునర్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే హోం శాఖ మంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్, విద్యుత్ శాఖ మంత్రి ఎంఎల్ ఖట్టర్, వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్ సమావేశమై చర్చించిన విషయం విధితమే.


పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో గతంలో పాకిస్థాన్‌తో జరిగిన సింధూ జలాల ఒప్పందాన్ని ఏప్రిల్ 24వ తేదీన నిలిపివేసింది. ఒక్క చుక్క నీరు సైతం దేశ సరిహద్దు దాటి పాక్‌లో ప్రవేశించడానికి వీలు లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ నదితోపాటు దాని ఉప నదుల ద్వారా పాకిస్థాన్‌లోని 80 శాతం వ్యవసాయానికి నీరందుతోన్న సంగతి తెలిసిందే.


ఏప్రిల్ 22వ తేదీన పహల్గాలంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటనలో పాకిస్థాన్ హస్తం ఉందనేందుకు సంబంధించిన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. వాటిని ప్రపంచ దేశాల ముందు పెట్టింది. దీంతో ఆయా దేశాల నుంచి భారత్‌కు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అయితే సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌కు ఏకాకిగా నిలిపేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. అందులోభాగంగా ఆ దేశాన్ని అష్టదిగ్బందం చేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

TGSRTC Workers Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

Updated Date - May 05 , 2025 | 06:45 PM