ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Puri Rath Yatra 2025: భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య అట్టహాసంగా పూరీ రథయాత్ర ప్రారంభం..

ABN, Publish Date - Jun 27 , 2025 | 10:38 AM

Puri Rath Yatra 2025 Begins: ప్రపంచ ప్రసిద్ధ పూరీ రథయాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశవిదేశీ భక్తులు పూరీకి తండోపతండాలుగా తరలివస్తున్నారు. యాత్ర సజావుగా సాగేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేసింది.

Puri Rath Yatra 2025

Puri Rath Yatra 2025 Begins: ఒడిశాలోని పూరీలో ఆషాఢ మాసం శుక్ల పక్ష ద్వితీయ తిథి పర్వదినాన జగన్నాథుని రథయాత్ర అట్టహాసంగా ఆరంభమైంది. ఈ విశ్వవ్యాప్త భారీ రథయాత్రకు దేశవిదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. పూరీనగర వీధులన్నీ జై జగన్నాథ్! అనే భక్తుల నినాదాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. భారీ జనసందోహం రాకను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతం వెంబడి విస్తృత స్థాయిలో బలగాలను మోహరించింది. నగరాన్ని హై-సెక్యూరిటీ జోన్‌గా మార్చారు. AI- ఆధారిత నిఘా, రియల్-టైమ్ టెక్నాలజీతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జగన్నాథ రథయాత్ర మొదలవుతుంది. సుందరరథంపై కొలువుదీరిన జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి దేవి సుభద్రలు గుండిచా ఆలయానికి ఊరేగింపుగా తరలివెళతారు. ఇక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రలు వారం రోజుల పాటు సేదతీరతారు. ఆ తర్వాత బహుదా యాత్ర (Bahuda Yathra) ద్వారా ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు. కాగా, ఈ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభుత్వ యంత్రాంగం అత్యాధునిక భద్రతా ఏర్పాట్లను పూర్తిచేసింది. పదివేలకు పైగా సిబ్బందిని తీరం వెంట మోహరించింది. కీలక ప్రాంతాలలో 275 కంటే ఎక్కువ AI- ఆధారిత CCTV కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు.

పూరీలో హై అలర్ట్, భారీ భద్రత

భారీ జనసందోహం పాల్గొంటున్నందున్నఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి ఒడిశా పోలీసులు ఎనిమిది కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలతో సహా సుమారు 10,000 మంది సిబ్బందిని మోహరించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) స్నిప్పర్ల సాయంతో గ్రాండ్ రోడ్డు వెంబడి రక్షణ బాధ్యతలను చేపట్టారు. తీరప్రాంత భద్రతను కోస్ట్ గార్డ్, భారత నావికాదళం నిర్వహిస్తున్నాయి. భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి పూరీలో తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వైబి ఖురానియా మాట్లాడుతూ, రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం పట్టణం అంతటా, కోణార్క్‌కు వెళ్లే మార్గాల్లో 275 కి పైగా AI- ఎనేబుల్డ్ CCTV కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు డ్రోన్లు, బాంబు స్క్వాడ్లు, యాంటీ-సాబోటేజ్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు, మెరైన్ పోలీసులు కూడా విస్తృతమైన ఏర్పాట్లలో భాగమయ్యారు. ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున, భారత వాతావరణ శాఖ పూరీతో సహా అనేక జిల్లాల్లో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

కాగా, రథయాత్రకు ఒక రోజు ముందు వేలాది మంది భక్తులు ‘నవయవ్వన దర్శనం’ లో పాల్గొన్నారు. దేవతల కళ్లకు రంగులు వేసే ‘నేత్రోత్సవం’ వీక్షించగలిగారు. రహస్య మందిరంలో15 రోజుల పాటు దేవతలను ఉంచాక ఆచారం ప్రకారం జూన్ 11న భక్తులకు ఈ దర్శనం చేసుకునే అవకాశం లభించింది.

ఈ వార్తలు కూడా చదవండి.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..

Read Latest Telangana News and National News

Updated Date - Jun 27 , 2025 | 12:14 PM