Share News

Gold and Silver Rates Today: నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 27 , 2025 | 06:49 AM

దేశంలో గత నాలుగు రోజులుగా తగ్గిన బంగారం, వెండి ధరలకు (Gold and Silver Rates Today) బ్రేక్ పడింది. ఈ క్రమంలో నేడు (జూన్ 27న) మాత్రం వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే గత నాలుగు రోజులుగా వీటి ధరలు ఏ మేరకు తగ్గాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold and Silver Rates Today: నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold and Silver Rates on June 27th 2025

భారతదేశంలో ఈరోజు (జూన్ 27న) బంగారం, వెండి ధరలు (Gold and Silver Rates Today) స్థిరంగా ఉన్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గిన ధరలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం జూన్ 27న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో విజయవాడ, హైదరాబాద్‌లో (Gold Price hyderabad june 27th 2025) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,940గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 90,690గా కలదు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 99,090 స్థాయికి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 90,840 స్థాయికి చేరింది.


నాలుగు రోజుల్లోనే..

అయితే జూన్ 23 నుంచి 26 వరకు 10 గ్రాముల పసిడి ధర దాదాపు రూ.1800 తగ్గింది. జూన్ రెండో వారంలో ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న పుత్తడి ధరలు, క్రమంగా తగ్గుతూ వచ్చాయి. జూన్ 14న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 1,01,680 అధిక స్థాయికి చేరుకున్నాయి. 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 93,200కి చేరింది. ఇక జూన్ 15 నుంచి జూన్ 26 వరకు జరిగిన మార్పుల తర్వాత బంగారం ధరలు రెండు శాతం పడిపోయాయి. ఇది బంగారం పెట్టుబడిదారులకు కొంత ఊరట కలిగిస్తుంది. అయితే ధరలు ఇంకా తగ్గాలని ప్రజలు భావిస్తుండగా, పలువురు వ్యాపారులు మాత్రం పెరగాలని కోరుకుంటున్నారు.


వెండి రేట్లు ఇలా..

ఇదే సమయంలో వెండి ధరల్లో కూడా మార్పు లేదు. ఈరోజు ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.107,900గా ఉండగా, హైదరాబాద్, విజయవాడలో రూ.117,900 స్థాయిలో ఉంది. మరోవైపు బులియన్ మార్కెట్లో కూడా పసిడి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులతోపాటు దేశీయ నిర్ణయాలు కూడా వీటి ధరలపై ప్రభావితం చూపించాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో మళ్లీ పసిడి ధరలు పెరుగుతాయని పలువురు చెబుతుండగా, మరికొంత మంది నిపుణులు మాత్రం తగ్గుతాయని అంటున్నారు.


ఇవీ చదవండి:

భారత్, ఇంగ్లాడ్ టెస్ట్‌ల మధ్య జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి..

జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 07:04 AM