ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ

ABN, Publish Date - May 09 , 2025 | 07:31 PM

మంగళవారం అర్ధరాత్రి తర్వాత పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు నిర్వహించింది. ఈ దాడులకు ఆపరేషన్ సిందూర్ అని ప్రధాని మోదీ పేరు పెట్టారు.

PM Modi

న్యూఢిల్లీ, మే 09: భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిత్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో వారంతా భేటీ అయ్యారు. అయితే గత వారం ముగ్గురు త్రివిధ దళాల అధిపతులతో వరుసగా మూడు రోజులపాటు ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కానీ శుక్రవారం మాత్రం వీరంతా కలిసి ప్రధాని మోదీతో సమావేశం కావడం గమనార్హం. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సైతం హాజరయ్యారు.


బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు నిర్వహించింది. ఈ దాడులకు ఆపరేషన్ సిందూర్ అని ప్రధాని పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌పై పాక్ ఎదురు దాడికి దిగింది. ఆ క్రమంలో భారత్, పాక్ సరిహద్దుల్లోని పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాలపై డ్రోనులు, క్షిపణులతో దాడికి దిగింది. వీటిని భారత్ తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈ భేటీలో చర్చించే అంశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.


మరోవైపు భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్‌ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని సైన్యం నిర్ణయించింది. ఇందులో నమోదు చేసుకున్న అధికారులు, సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్‌కు అధికారం కల్పించింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీకి ప్రత్యేక అధికారాలను కేంద్రం కట్టబెట్టిన సంగతి తెలిసిందే.


ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో మొత్తం 26 మంది మరణించారు. ఈ ఘటన వెనుక పాకిస్థాన్ ఉందనే సాక్ష్యాలను భారత్ సంపాదించింది. దీంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే పాక్ సైతం భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా మారాయి. ఆ క్రమంలో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదులను అంతమొందించింది. దీనికి ప్రతిగా బుధవారం రాత్రి భారత్ సరిహద్దులోని భూభాగంపై ద్రోనులు, క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిని భారత్ తిప్పికొట్టింది. దీంతో ఇరు దేశాల మద్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో.. త్రివిధ దళాదిపతులతో ప్రధాని మోదీ సమావేశం కావడం చర్చనీయాంశమైంది.

Also Read:

Operation Sindoor: సైబర్ దాడి.. బిగ్ అలర్ట్

పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేశాం

Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..

Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..

Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం

For National News And Telugu News

Updated Date - May 09 , 2025 | 08:10 PM