Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..
ABN , Publish Date - May 09 , 2025 | 04:26 PM
Operation Sindoor: భారత్ లక్ష్యంగా పాకిస్థాన్ ద్రోణులు, క్షిపణులు దాడులు చేస్తుంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు భారత్ తిప్పికోడుతోంది. అలాంటి వేళ.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఉన్నతాధికారులతో న్యూఢిల్లీలో కీలక భేటీ నిర్వహించారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 09: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ లక్ష్యంగా ద్రోణులు, క్షిపణులతో పాకిస్థాన్ దాడి చేస్తోంది. ఈ దాడులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికోడుతోంది. అలాంటి వేళ.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన శుక్రవారం న్యూఢిల్లీలో కీలక భేటీ జరిగింది. ఈ భేటీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర దివ్వేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠీ హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చించినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది మరణించారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందంనేందుకు కీలక సాక్ష్యాలను భారత్ సంపాదించింది. వాటిని ప్రపంచ దేశాల ముందు ఉంచిది. అలాగే పాకిస్థాన్‌పై భారత్ కీలక ఆంక్షలు విధించింది. ఆ క్రమంలో మే 7వ తేదీ తెల్లవారుజామున పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలను నేలమట్టం చేశారు భారత్ సైనికులు. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.
అందుకు ప్రతిగా పాకిస్థాన్ సైతం మే 8వ తేదీన ఇరుదేశాల సరిహద్దు వెంట ఉన్న నగరాలు.. జమ్మూ, పఠాన్‌కోట్, ఉదంపూర్ తదితర ప్రాంతాలపైకి ద్రోణులు, క్షిపణులతో దాడులకు దిగింది. వీటిని భారత్ తిప్పికొట్టింది. దేశ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రజలను కాపాడడమే లక్ష్యంగా తాము ముందుకు వెళ్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
అదీకాక.. పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందానికి నీళ్లు వదులుతోంది. ఆ క్రమంలో భారత్ భూభాగంలోని సైనికుల పోస్టులపైకి కాల్పులు తెగబడుతోంది. వీటిని భారత్ సైనికులు తిప్పికొడుతున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Also Read:
Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
China: ఇండో-పాక్ వార్‌పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..
Pakistani Man Viral Video: పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు
For National News And Telugu News