Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
ABN , Publish Date - May 09 , 2025 | 03:42 PM
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్‌పై ద్రోణులతో పాకిస్థాన్ తిరగబడింది. అయితే ఈ దాడులను భారత్ తిప్పికొట్టింది. భారత్, పాకిస్థాన్ నడుమ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని భారత్, పాక్ సరిహద్దుల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

న్యూఢిల్లీ, మే 09: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు జమ్మూ ప్రభుత్వం తరలిస్తుంది. ప్రజలకు భోజనంతోపాటు షెల్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే ఫుడ్, మెడికల్ క్యాంపులను అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు నగరంలో పరిస్థితుల స్థితిగతులు తెలుసుకునేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన చర్చించారు.
అలాగే వారికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఇక జమ్ము కాశ్మీర్‌లోని విద్యా సంస్థలకు సోమవారం వరకు సెలవు ప్రకటించారు. స్థానిక పరిస్థితులపై సోమవారం చర్చించి.. సెలవులు పొడిగించాలా లేదా అనే అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకున్న నేపథ్యంలో గురువారం నుంచి రెండు రోజుల పాటు పాఠశాలకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని పలు నగరాల్లో సైరన్ వినిపించిన సంగతి తెలిసిందే. అక్నూర్, సాంబ, బారాముల్లా, కుప్వారా తదితర నగరాల్లో ఈ సైరన్ శబ్దం వినిపించింది.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రతను పెంచారు. వాటి వద్ద భద్రతను రెండో లెవల్‌కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భద్రతా పెంపు ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయన్న షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ కీలక ప్రకటన చేశారు. పోర్టులు, షిప్పులు, టర్మీనల్స్‌లో భద్రతను కేంద్రం పెంచింది.
ఇంకోవైపు.. శుభకార్యాలయాల్లో టాపాసులు పేల్చకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది. అవసరమైతే ముందు జాగ్రత్త చర్యలను సమర్థవంతంగా అమలు చేయడానికి పౌర రక్షణ నిబంధనల ప్రకారం.. అత్యవసర అధికారాలను ఉపయోగించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.
Also Read:
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
China: ఇండో-పాక్ వార్‌పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..
Pakistani Man Viral Video: పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు