Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..
ABN , Publish Date - May 09 , 2025 | 05:21 PM
Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు ఇరు దేశాల మధ్య పరిస్థితి తీవ్రంగా మారింది. అలాంటి వేళ.. మాజీ సీఎం, పీడీపీ అధినేత మహబూబా ముఫ్తీ స్పందించారు.

శ్రీనగర్, మే 09: భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతోన్న కాల్పుల్లో అమాయక చిన్నారులతోపాటు మహిళలు మరణిస్తున్నారని జమ్మూ కశ్మీర్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం మహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న టెన్షన్లు నివారించేందుకు రాజకీయ జోక్యం అవసరమని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఈ దాడులపై తొలిసారిగా మహబూబా ముఫ్తీ స్పందించారు.
శుక్రవారం శ్రీనగర్‌లో మాజీ సీఎం మహబూబా ముఫ్తీ విలేకర్లతో మాట్లాడుతూ.. గతంలో జరిగిన పుల్వామా అయినా.. పహల్గాం అయినా.. ప్రమాదం మాత్రం దేశ అంచునకు తీసుకు వెళ్లాయన్నారు. సరిహద్దు ప్రాంతంలో చిన్నారి కవలలు ఆడుకోవడం చూశానని.. అదే చిన్నారులు రక్తం మడుగులో పడి విగత జీవులుగా ఉండడాన్ని సైతం చూశాన్నారు. ఇలా విగత జీవులుగా మారుతోన్న చిన్నారులు, మహిళలకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఈ వారి మరణాలకు తప్పు ఎవరిదంటూ ఆమె నిలదీశారు. చిన్నారుల మరణంతో ఆ తల్లల ఒడి ఖాళీగా మారుతోందని.. ఇలా ఎంత కాలమంటూ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ కన్నీటి పర్యంతమవుతూ ప్రశ్నించారు.
ఇరువైపులా కాల్పుల వల్ల జమ్మూ కశ్మీర్ వాసులు మరణిస్తున్నారన్నారు. కాల్పులు ఇలాగే జరిగితే.. ప్రపంచం అపాయకర స్థితికి చేరుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కార్గిల్, పుల్వామా, పహల్గాం, పఠాన్‌కోట్ ఇలా ఏ ప్రాంతంలో నైనా... కాల్పులు ఒకటేనన్నారు. అసలు ఈ సమస్య మూలాలను తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులను ఆపాలంటూ ఇరు దేశాలకు ఈ సందర్భంగా ఆమె విజ్జప్తి చేశారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు ఫోన్‌లో చర్చల జరపడం ద్వారా వీటిని పరిష్కరించుకోవాలని భారత్, పాకిస్థాన్‌లకు ఆమె సూచించారు.
మే 8వ తేదీన పాకిస్తాన్ సాయుధ దళాలు.. భారత్‌లోని పశ్చిమ సరిహద్దుల వెంబడి డ్రోన్లతోపాటు క్షిపణులను ప్రయోగించింది. దీంతో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌తోపాటు గుజరాత్‌లోని అనేక పట్టణాలలో సైరన్లను సైన్యం మోగించాయి. అలాగే విద్యుత్ సరఫరాను పలు ప్రాంతాల్లో నిలిపి వేశాయి. తద్వారా పాకిస్థాన్ జరిపిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత సైన్యం ప్రకటించింది.
ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మృతి చెందారు. అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. అనంతరం రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ క్రమంలో గురువారం రాత్రి భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లోని నగరాలే లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లతోపాటు క్షిపణు దాడులకు దిగింది. వీటిని భారత్ తప్పికొట్టడం ద్వారా తన సత్తాను చాటింది.
Also Read:
Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..
Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం
For National News And Telugu News