ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: ఈ పోరులో ఇండియా గెలుస్తుంది, సందేహం లేదు: యోగి

ABN, Publish Date - May 09 , 2025 | 04:59 PM

శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మన టూరిస్టులను అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం అందరూ చూశామని, ప్రధానమంత్రి తీసుకున్న కచ్చితమైన నిర్ణయంతో మన సైనికులు పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు.

లక్నో: పాక్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించడంతో పాటు దాన్ని పొంచి పోషిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) విమర్శించారు. ఇటీవల భారత్ ప్రతి దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల అంతక్రియల్లో పాకిస్థాన్ ఉన్నతాధికారులు, రాజకీయనేతలు పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని. ఇది పాక్ సిగ్గులేని చర్యలు చాటుతోందని అన్నారు. ఉగ్రవాదంలో ప్రత్యక్ష సంబంధాలున్న పాక్ ఇప్పుడు దాని ఉనికి కోసం పోరాడుతోందని దుయ్యబట్టారు. మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ, మన టూరిస్టులను అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం అందరూ చూశామని, ప్రధానమంత్రి తీసుకున్న కచ్చితమైన నిర్ణయంతో మన సైనికులు పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు.

Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..


ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా జాతీయ ఐక్యతకు కట్టుబడి ప్రజలంతా మన సాయుధ బలగాలకు అండగా నిలబడాలని యోగి కోరారు. ప్రతి ఒక్క భారతీయుడు బాధ్యతగా వ్యవహరించాలని, ఎవరైనా తప్పుడు సమాచార వ్యాప్తి చేస్తే, అంతా అప్రమత్తంగా ఉండి జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ఎలాంటి చర్యలనైనా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదకగా తప్పుడు ప్రచారం జరగవచ్చని, అయితే వాటిని పట్టించుకోకుండా ప్రధాన మంత్రి నాయకత్వాన్ని అనుసరించాలన్నారు. ''భారతదేశం గెలుచితీరుతుంది... అందులో సందేహం లేదు'' అని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా కలిసికట్టుగా దేశానికి సేవలందించాలో మహారాణా ప్రతాప్ జయంతి ద్వారా స్ఫూర్తి పొందాలన్నారు. ఈ తరుణంలో మన భద్రత బలగాలకు బాసటగా నిలిచి వారి ఆత్మస్థైర్యాన్ని మరించ పెంచుతామని ప్రజలంతా ప్రతిన బూనాలని కోరారు.


Also Read:

India-Pak Tensions: ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు.. రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ

Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

China: ఇండో-పాక్ వార్‌పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..

Updated Date - May 09 , 2025 | 06:38 PM