India-Pak Tensions: ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారులు.. రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ
ABN , Publish Date - May 09 , 2025 | 03:55 PM
సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాక్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్‌కు కేంద్రం మరిన్ని అధికారాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీ (Terrotorail Army)ని రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇందులోని అధికారులు, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్‌కు అధికారం కల్పించింది. టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948 కింద కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెగ్యులర్ ఆర్మీతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేస్తుంది.
Operation Sindoor: త్రివిధ సైన్యాధిపతులతో రక్షణ మంత్రి సమావేశం.. దేనికైనా సిద్ధం అంటూ...
సైనిక రిజర్వ్ ఫోర్స్‌గా టెరిటోరియల్ ఆర్మీ పనిచేస్తుంటుంది. ప్రత్యర్థులతో తలపడేందుకు భారత్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు ఈ టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. రెగ్యులర్ ఆర్మీలో ఇది భాగమే అయినప్పటికీ అవసరమైన సందర్భంలోనే ఈ టెరిటోరియల్ ఆర్మీ రంగంలోకి దిగుతుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సమయంలో టెరిటోరియల్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. 1962, 1965, 1971 యుద్ధాల్లోనూ భారత సైన్యంతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేసింది. రెగ్యులర్ ఆర్మీకి సెకండరీ ఫోర్స్‌గా ఉండే టెరిటోరియల్ ఆర్మీలోని సిబ్బందికి నేషనల్ ఎమర్జెన్జీ, అంతర్గత భద్రత విధులకు సంబంధించి శిక్షణ ఇస్తుంటారు. ప్రస్తుతం 32 టెరిటోరియల్ ఆర్మీ ఇన్ఫాంట్రీ బెటాలియన్స్ ఉన్నాయి.
Also Read:
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై మాది సహాయక పాత్ర మాత్రమే.. వరల్డ్ బ్యాంక్
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
China: ఇండో-పాక్ వార్‌పై చైనా షాకింగ్ రియాక్షన్.. ఏమందంటే..