Army viral video: ఉగ్రవాదులకు సాయం చేశాడు.. నదిలో శవమై తేలాడు.. వీడియో వైరల్..
ABN, Publish Date - May 05 , 2025 | 08:11 AM
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి నదిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. భద్రతా బలగాల వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది...
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఓ వ్యక్తి నదిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. భద్రతా బలగాల వైఫల్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోతో ఆ వ్యక్తి తనకు తానుగా నదిలోకి దూకినట్లు తెలుస్తోంది..
కుల్గాం జిల్లాలో (Kulgam District) ఉగ్రవాదులకు సాయం చేసినట్లు సమాచారం అందడంతో స్థానిక ప్రాంతానికి చెందిన ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే (23) అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను ఉగ్రవాదులకు సాయం చేసినట్లు అంగీకరించాడు. అలాగే ఉగ్రవాదులను బయటికి రప్పించేందుకు సాయం చేస్తానని చెప్పడంతో ఆర్మీ బలగాలు ఆదివారం అతడిని అనుసరిస్తూ వెళ్లాయి.
అయితే ఈ క్రమంలోవేషా నదికి సమీపంలోకి వెళ్లగానే.. ఆ వ్యక్తి ఒక్కసారిగా అందులోకి దూకి (Man Jumped into River) తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కాలేదు. చివరకు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. దీనికి కారణం భద్రతా బలగాల నిర్లక్ష్యమే అంటూ ఆరోపణలు వస్తున్న సమయంలో ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో ఇంతియాజ్ పరుగెత్తుకుంటూ వెళ్లి నదిలోకి దూకినట్లుగా కనిపిస్తోంది.
నదిలో కొట్టుకుపోతున్న అతన్ని చాలా దూరం వరకూ డ్రోన్ కెమెరా అనుసరిస్తూ వెళ్లింది. నదీ ప్రవాహంలో ఈత కొడుతూ తప్పించుకునే క్రమంలో వేగం ఎక్కువగా ఉండడం వల్ల మునిగిపోయినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోతో ఇందులో భద్రతా బలగాల తప్పు లేదని స్పష్టమైంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
For National News And Telugu News
Updated Date - May 05 , 2025 | 08:11 AM