Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ..
ABN , Publish Date - May 04 , 2025 | 01:44 PM
Pehalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో భారత్ ఏ క్షణమైన తమ దేశంపై దాడికి దిగుతోందంటూ పాకిస్థాన్‌లో ఓ విధమైన ఆందోళన వ్యక్తమవుతోంది. అలాంటి వేళ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్.. ప్రధానితో సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ, మే 04: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో భారత్ ఏ క్షణమైన తమ దేశంపై దాడికి దిగుతోందంటూ పాకిస్థాన్‌లో ఓ విధమైన ఆందోళన వ్యక్తమవుతోంది. అలాంటి వేళ త్రివిధ దళాలలోని ఇద్దరు అధిపతులతో ప్రధాని మోదీ వరుసగా సమావేశమయ్యారు. ఆదివారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ ఏయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీతి సింగ్‌తో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకోంది.
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌ను భారత్ అష్టదిగ్భంధనం చేస్తోంది. విడతల వారీగా తీసుకుంటున్న పలు నిర్ణయాలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయితే భారత్ ఎప్పుడు దాడి చేస్తోందనని పాకిస్థాన్ వణుకుతోంది. మరోవైపు భారత్ చర్యలపై ప్రధాని మోదీ వరుసగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇక శనివారం నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో ప్రధాని మోదీ సమావశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో అరేబియా సముద్రంలోని సరిహద్దులతోపాటు పలు కీలక అంశాలపై ఆయనతో ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి సందర్భంగా 26 మంది మరణించారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ఉందనేందుకు బలమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. వాటిని ప్రపంచం ముందు ఉంచింది. అంతేకాకుండా.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. అలాగే బారత్‌కు వ్యతిరేకంగా పాక్ సైతం వివిధ నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా మారాయి. ఇక పాకిస్థాన్ అయితే.. భారత్ ఏ క్షణమైనా తమ దేశంపై దాడి చేస్తుందనే భయాందోళనతో ఉంది. అలాంటి సందర్భాల్లో ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు కావడం.. దాయాది దేశం పాక్‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
భారత్‌తో యద్ధంపై స్పందించిన పాక్ రాయబారి
తెరుచుకున్న బద్రీనాథ్ దేవాలయం తలుపులు
మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్
For National News And Telugu News..