India Vs Pakistan: భారత్‌తో యుద్ధంపై స్పందించిన పాక్ రాయబారి
ABN , Publish Date - May 04 , 2025 | 10:03 AM
India Vs Pakistan: పహల్గాం దాడి అనంతరం పాక్ పై భారత్ కఠిన వైఖరి అవలంబించింది. దీంతో పాకిస్థాన్ మంత్రి హానీఫ్ అబ్బాసి స్పందించారు. భారతదేశంపై అణ్వాయుధాలతో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన బహిరంగంగానే బెదిరించారు. తమ దేశ ఆయుధాగారంలో..ఘోరి, షాహీన్, గజినీ క్షిపణులతోపాటు 130 అణ్వాయుధ వార్‌హెడ్‌లు భారతదేశం కోసమే ఉంచామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
న్యూఢిల్లీ, మే 04: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా పాక్‌పై భారత్ దాడి చేస్తుందంటూ ఇప్పటికే ఆ దేశంలో పలువురు మంత్రులు సైతం ప్రకటించారు. తాజాగా రష్యాలోని పాకిస్థాన్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ ఆదివారం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పాక్‌పై భారత్ దాడి చేసే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు గట్టిగా బదులిస్తామని ఆయన తెలిపారు. ఆ క్రమంలో తమ వద్దనున్న అన్ని ఆయుధాలను భారత్‌పై ఉపయోగిస్తామన్నారు. అణ్వాయుధాలను సైతం భారత్‌పై ప్రయోగిస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు.
పాకిస్థాన్ భూభాగంలోని కొన్ని ప్రాంతాలపై భారత్ దాడి చేస్తుందనేందుకు.. తమ వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. భారత్‌కు చెందిన మీడియా చేస్తున్న పలు వ్యాఖ్యలు పూర్తి బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని ఆయన పేర్కొన్నారు. భారతదేశం, పాకిస్తాన్‌ల విషయానికి వస్తే.. బలాబలాల సంఖ్యా బలం గురించి ఈ చర్చలో తాము ప్రస్తావించకూడదనుకొంటున్నట్లు ఆయన చెప్పారు. భారత్‌పై తమ పూర్తి ఆస్త్ర శస్త్రాలను వినియోగించేందుకు తమ సైన్యానికి పాకిస్థానీ ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
మరోవైపు పాకిస్థాన్ మంత్రి హానీఫ్ అబ్బాసి స్పందించారు. భారతదేశంపై అణ్వాయుధాలతో దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన బహిరంగంగానే బెదిరించారు. తమ దేశ ఆయుధాగారంలో..ఘోరి, షాహీన్, గజినీ క్షిపణులతోపాటు 130 అణ్వాయుధ వార్‌హెడ్‌లు భారతదేశం కోసమే ఉంచామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. అంతేకాదు.. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్ నీటి సరఫరాను ఆపడానికి భారతదేశం ధైర్యం చేస్తే.. అది పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కావాల్సి ఉంటుందని అబ్బాసి వ్యాఖ్యానించారు.
పాకిస్థానీలోని మరో మంత్రి అతుల్లా తరార్ సైతం ఇప్పటికే స్పందించారు. తమపై 24 నుంచి 36 గంటల్లో భారత్ సైనిక దాడులు జరుపుతోందనేందుకు తమ వద్ద విశ్వసనీయ వర్గాల సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. ఓ వేళ భారత్ దాడి చేస్తే.. తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. తరార్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని మోదీ.. భారత్ సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Char Dham Yatra 2025: తెరుచుకున్న బద్రీనాథ్ దేవాలయం తలుపులు
Dr KV Subramaniam: డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంను విధుల నుంచి తొలగించిన కేంద్రం
Pakistan violates ceasefire: మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్
For National News And Telugu News