Share News

Char Dham Yatra 2025: తెరుచుకున్న బద్రీనాథ్ దేవాలయం తలుపులు

ABN , Publish Date - May 04 , 2025 | 08:57 AM

Char Dham Yatra 2025: చార్ ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ దేవాలయం తలుపులు ఆదివారం తెరుచుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ హాజరయ్యారు.

Char Dham Yatra 2025: తెరుచుకున్న బద్రీనాథ్ దేవాలయం తలుపులు

నైనిటాల్, మే 04: ఉత్తరాఖండ్‌లోని శ్రీ బద్రీనాథ్ దేవాలయం తలుపులు ఆదివారం తెరుచుకోన్నాయి. జై బద్రీనాథ్ విశాల్ అంటూ లక్షలాది మంది భక్తుల జపిస్తుండగా.. గర్వాల్ రైఫిల్స్‌కు చెందిన భారత ఆర్మీ భక్తి సంగీతాన్ని వినుల విందుగా వాయిస్తుండగా ఈ దేవాలయం ద్వారాలు తెరుచుకున్నాయి. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ ఈ దేవాలయంలోకి ప్రవేశించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతోపాటు స్థానికులతో సీఎం పుష్కర్ సింగ్ సంభాషించారు. ఆ తర్వాత ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ చార్‌ ధామ్ యాత్ర సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.


అలాగే భారీగా భద్రతా దళాలను మోహరించినట్లు చెప్పారు. జోషి మఠ్‌ పునర్ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరిన వెంటనే వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఆ క్రమంలో తొలి విడతగా రూ. 292 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఈ దేవాలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో అందంగా అలంకరించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా దేవాలయ పరిసర ప్రాంతాల్లోని భక్తులపై పూల వర్షం కురిపించారు.


2025 చార్‌ ధామ్ యాత్ర..

ఏప్రిల్ 30వ తేదీ.. అది కూడా అక్షయ తృతీయ రోజు.. గంగోత్రి, యమునోత్రి దేవాలయాల తలుపులు తెరుచుకోన్నాయి. తద్వారా ఈ చార్‌ ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ఇక మే 2వ తేదీన కేదార్‌నాథ్ దేవాలయం తలుపులు తెరిచారు. తాజాగా బద్రీనాథ్ దేవాలయం తలుపులు తెరుచుకున్నాయి. దీంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైనట్లు అయింది.

ఇవి కూడా చదవండి

Dr KV Subramaniam: డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంను విధుల నుంచి తొలగించిన కేంద్రం

Pakistan violates ceasefire: మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్

For National News And Telugu News

Updated Date - May 04 , 2025 | 09:07 AM