Share News

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

ABN , Publish Date - May 04 , 2025 | 12:20 PM

India Vs Pakistan: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ.. భారత్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన, సున్నితమైన అంశాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

న్యూఢిల్లీ, మే 4: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది మరణించారు. దీంతో భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ భారత్ సైన్యానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని దాయాది దేశం పాకిస్థాన్‌‌కు అందించిన నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులను అమృత్‌సర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమృత్‌సర్‌లోని కంటోన్మెంట్ ఏరియాతోపాటు ఎయిర్ బేస్‌కు సంబంధించిన పలు చిత్రాలను సైతం వీరు పాకిస్థానీ అధికారులకు అందజేసినట్లు తమ విచారణలో వెల్లడైందని పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం తెలిపారు.


నిందితులు ఇద్దరి పేర్లు పాలక్ షేర్ మషిహ్, సురజ్ మహిష్‌ అని వెల్లడించారు. అయితే అమృత్‌సర్ సెంట్రల్ జైల్లో ఉన్న హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టూ, హ్యాపీ సూచనల మేరకు వారు ఈ సమాచారాన్ని పక్క దేశపు నిఘా అధికారులకు అందజేసినట్లు తమ ప్రాథమిక విచారణలో వీరిద్దరు వెల్లడించారన్నారు. జాతీయ భద్రతకు హాని కలిగించే విధంగా హై సెక్యూరిటీ విజువల్స్‌తోపాటు పలు కీలక వివరాలను శత్రు దేశపు నిఘా వర్గాలకు అందించినట్లు ఈ విచారణలో తెలిపారన్నారు. అధికారిక రహస్యాల చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.

పహల్గాం దాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ సరిహద్దుల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే నిఘాను సైతం పట్టిష్టం చేశారు. ఆ క్రమంలో ఈ ఇద్దరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

India Vs Pakistan: భారత్‌తో యద్ధంపై స్పందించిన పాక్ రాయబారి

Char Dham Yatra 2025: తెరుచుకున్న బద్రీనాథ్ దేవాలయం తలుపులు

Dr KV Subramaniam: డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంను విధుల నుంచి తొలగించిన కేంద్రం

Pakistan violates ceasefire: మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్

For National News And Telugu News

Updated Date - May 04 , 2025 | 12:52 PM