High Court: పోలీస్‌స్టేషన్ టాయిలెట్లలో నేరస్తులు మాత్రమే పడిపోతున్నారా...
ABN, Publish Date - May 16 , 2025 | 01:32 PM
పోలీస్‌స్టేషన్లలో ఉన్నటువంటి మరుగుదొడ్లలో కేవలం నేరస్తులు మాత్రమే పడిపోతున్నారా.. అంటూ మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. పోలీస్‌స్టేషన్లలో ఉన్న టాయిలెట్లలో నేరస్తులు మాత్రమే పడి గాయాలు ఏర్పడేలా ఉన్నాయా.. ఆ టాయిలెట్లను ఇన్స్‌పెక్టర్లు వినియోగించడం లేదా.. వారికి ఎలాంటి గాయాలు కావడం లేదు కదా.. అంటూ ప్రశ్నించింది.
- ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు
చెన్నై: రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లలో ఉన్న టాయిలెట్లలో నేరస్తులు మాత్రమే పడిపోయేలా ఉన్నాయా.. అంటూ మద్రాసు హైకోర్టు(Madras High Court) ప్రశ్నించింది. ఓ కేసులో అరెస్టయి జైలులో ఉన్న కాంచీపురానికి చెందిన జాకీర్ హుస్సేన్ చేతులు, కాళ్లు విరిగాయని.. అతడికి చికిత్స చేయించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ అతని తండ్రి ఇబ్రహీం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. విషయం ఏంటంటే..
ఈ పిటిషన్ న్యాయమూర్తులు జీఆర్ స్వామినాథన్, లక్ష్మీనారాయణన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. అరెస్ట్ అయిన వ్యక్తి ఎలా గాయపడ్డాడని ధర్మాసనం ప్రశ్నించింది. టాయిలెట్‌లో జారిపడడంతో గాయం ఏర్పడినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే ప్రభుత్వ వివవరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం... పోలీస్ స్టేషన్ల టాయిలెట్లలో నేరస్తులు మాత్రమే పడి గాయాలు ఏర్పడేలా ఉన్నాయా? అని ప్రశ్నించింది.
ఆ టాయిలెట్లను ఇన్స్‌పెక్టర్లు వినియోగించడం లేదా?, వారికి ఎలాంటి గాయాలు కావడం లేదు కదా? అంటూ అడిగింది. ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని సూచించిన ధర్మాసనం.. సంబంధిత పోలీసులను విధుల నుంచి తొలగించే పరిస్థితి వస్తుందని హెచ్చరించింది. అనంతరం పిటిషనర్‌కు చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించాలని ఆదేశించి కేసు విచారణ ముగిసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..
తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు
పకృతి విధ్వంసానికి సీఎందే బాధ్యత: కేటీఆర్
ఆర్టీసీ సీసీఎస్‌లో 15 రోజుల్లోగా రూ.1,029 కోట్లు జమ చేయాలి
Read Latest Telangana News and National News
Updated Date - May 16 , 2025 | 03:26 PM