Share News

అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - May 16 , 2025 | 01:05 PM

ఏం జరిగిందో తెలియదు.. కానీ.. రెండు నిండు ప్రాణాలు మాత్రం అనంత వాయువుల్లో కలిసిపోయాయి. పెళ్లైన కొద్దికాలానికే భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. అందులో మరో కొద్దిరోజుల్లో ఆ ఇంట్లో చంటిబిడ్డ కేకలు వినాల్సి ఉండగా ఇంతలోనే ఈ విషాదం నెలకొంది.

అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. విషయం ఏంటంటే..

- దంపతుల ఆత్మహత్య

చెన్నై: నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడగా, ఈ విషయం తెలిసి తట్టుకోలేక భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరువణ్ణామలై జిల్లాలో చోటుచేసుకుంది. వందవాసి సమీపం విళుదుపట్టు గ్రామానికి చెందిన వేలు కుమార్తె దివ్య (19), తళుతాలై గ్రామానికి చెందిన చెల్లప్పన్‌ కుమారుడు ప్రతాప్‏ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం దివ్య నాలుగు నెలల గర్భంతో ఉంది. పదిరోజుల క్రితం కన్నవారింటికి వచ్చిన దివ్య, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: 8 వేల ఏళ్లనాటి రాతి పనిముట్లు లభ్యం


nani2.2.jpg

ఈ సమాచారం తెలుసుకున్న ప్రతాప్‌.. విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చుట్టుపక్కల వారు అతడిని వందవాసి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం చెంగల్పట్టు ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించారు. అక్కడ చికిత్సలు ఫలించక ప్రతాప్‌ మృతిచెందాడు. ఈ ఘటనపై వందవాసి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


nani2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..

తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు

ఈటల.. దిగజారుడు రాజకీయం తగదు

పకృతి విధ్వంసానికి సీఎందే బాధ్యత: కేటీఆర్‌

ఆర్టీసీ సీసీఎస్‌లో 15 రోజుల్లోగా రూ.1,029 కోట్లు జమ చేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - May 16 , 2025 | 01:06 PM