Share News

Chennai: 8 వేల ఏళ్లనాటి రాతి పనిముట్లు లభ్యం

ABN , Publish Date - May 16 , 2025 | 12:35 PM

8 వేల ఏళ్ల కాలంనాటి రాతి పనిముట్లు లభ్యమయ్యాయి. కడలూరు జిల్లాలో 8 వేల ఏళ్లనాటి రాతి పనిముట్టను గురించారు. వీటిని పురావస్తు శాఖ వారు స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధికారి మాట్లాడుతూ.. ఈ అరుదైన పనిముట్లు తవ్వకాల్లో లభ్యమవుతున్నాయని, వీటిని భద్రపరిచేందుకు ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు తెలిపారు.

Chennai: 8 వేల ఏళ్లనాటి రాతి పనిముట్లు లభ్యం

చెన్నై: కడలూరు జిల్లా బన్రూటి సమీపంలో సుమారు 8 వేల ఏళ్ల నాటి పురాతన రాతి పనిముట్లు లభ్యమైనట్లు పురావస్తు పరిశోధన శాఖ నిపుణులు తెలిపారు. కడలూరు(Kadaluru) జిల్లా దక్షిణ ప్రాంతంలో ఉన్న మరుంగూర్‌, పాలకొల్లై, వట్టప్పన్‌కుప్పం, భద్రకోత తదితర గ్రామాల్లో పురావస్తు శాఖ తవ్వకాల్లో విద్యార్థులు, నిపుణులు పాల్గొంటున్నారు. ఈ తవ్వకాల్లో తాజాగా ఉళుందంపట్టు దక్షిణ పెన్నా నదితీరంలో లభ్యమైన రాతి పనిముట్టు ఎత్తు 2.5 సెం.మీ, పొడవు 2 సెం.మీ అని, దీంతో జంతువుల చర్మం ఒలిచేందుకు వినియోగిస్తుంటారు.

ఈ వార్తను కూడా చదవండి: Turkish Firm Celebi: తుర్కియే సంస్థ ‘సెలెబి’కి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన అదానీ..


8 వేల ఏళ్లనాటి రాతి పనిముట్టు గురించి పురావస్తు శాఖ పరిశోధకులు శివరామకృష్ణన్‌ మీడియాకు వివరిస్తూ... రాతియుగం నాటి ప్రజలు క్రూర జంతువులను వేటాడుతుండేవారని, వారు అప్పట్లో అందుబాటులో ఉన్న రాళ్లతో ఆయుధాలు తయారుచేసి వినియోగిచేవారని, ఇవి చూసేందుకు చిన్నవిగా ఉన్నా, పదునుగా ఉంటాయని తెలిపారు. ఈ అరుదైన పనిముట్లు తవ్వకాల్లో లభ్యమవుతున్నాయని, వీటిని భద్రపరిచేందుకు ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..

తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు

ఈటల.. దిగజారుడు రాజకీయం తగదు

పకృతి విధ్వంసానికి సీఎందే బాధ్యత: కేటీఆర్‌

ఆర్టీసీ సీసీఎస్‌లో 15 రోజుల్లోగా రూ.1,029 కోట్లు జమ చేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - May 16 , 2025 | 12:35 PM