Khushboo: ఎన్నికల వేళ ఖుష్బూ సంచలన కామెంట్స్.. డీఎంకే బండారం బయటపెడతా
ABN, Publish Date - Aug 06 , 2025 | 12:26 PM
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా స్టిక్కర్లు వేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, నటి ఖుష్బూ ఆరోపించారు.
- బీజేపీ ఉపాధ్యక్షురాలు ఖుష్బూ
చెన్నై: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ డీఎంకే(DMK) ప్రభుత్వం అమలు చేస్తున్నట్లుగా స్టిక్కర్లు వేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, నటి ఖుష్బూ(Khushboo) ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం గత నాలుగేళ్లలో చేసిన అవినీతి అక్రమాలను త్వరలోనే బహిర్గతం చేస్తానని, పాలకుల అసలు రంగు బయటపడుతుందన్నారు.
మీడియాతో ఆమె మాట్లాడుతూ... కేంద్రప్రభుత్వం రైతులకు, విద్యార్థులకు, నిరుపేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అవి అర్హులకు చేరకముందే ఆ పథకాలకు డీఎంకే ప్రభుత్వ స్టిక్కర్లు, ప్రత్యేకించి స్టాలిన్(Stalin) ఫొటోల స్టిక్కర్లు అతికించి, ఆ పథకాలన్నీ తమవిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, బాలికలకు, యువతులకు,
వృద్ధులకు భద్రతలేదని, అత్యాచారాలు, హత్యలు, నేరాలు రోజురోజుకూ అధికమవుతున్నాయే గానీ తగ్గటం లేదని ఖుష్బూ ఆరోపించారు.. హోం మంత్రిత్వ శాఖ నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఎలాంటి చర్యలు చేపట్టకుండా అచేతనంగా ఉంటూ తమ ప్రభుత్వం కోసం గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. త్వరలోనే ప్రజలంతా డీఎంకే పాలనకు చరమగీతం పాడనున్నారని ఖుష్బూ జోస్యం చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Read Latest Telangana News and National News
Updated Date - Aug 06 , 2025 | 12:26 PM