Share News

Telangana weather: నేడు, రేపు భారీ వర్షాలు

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:18 AM

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Telangana weather: నేడు, రేపు భారీ వర్షాలు

  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గురువారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, యాదాద్రి భువనగిరి, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్‌, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం మధ్య రాష్ట్రంలో ఏడు మండలాల్లో 6-10 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. మరో 78 మండలాల్లో 2-6 సెం.మీ. మధ్య వర్షపాతం రికార్డు అయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 05:18 AM