Guvvala Bala Raju VS BRS: కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:39 AM
బీజేపీ, కాంగ్రెస్ నేతలు తనకు టచ్‌లోకి వచ్చిన మాట వాస్తవమని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. తన నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీఎల్ సంతోష్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని గువ్వాల బాలరాజు పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు5 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ పార్టీపై (BRS) అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) షాకింగ్ కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఆరోపించారు. బీఆర్ఎస్‌లో పరిణామాలు చూస్తుంటే పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదని ఆక్షేపించారు. బీఆర్ఎస్, బీజేపీ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత లాంటి నేతలు కూడా చెప్పారని గుర్తుచేశారు. బీఆర్ఎస్‌లో తనకు భవిష్యత్తు లేదనే అసంతృప్తితోనే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. ఇవాళ(మంగళవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో గువ్వల బాలరాజు మాట్లాడారు.
ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు తనకు టచ్‌లోకి వచ్చిన మాట వాస్తవమని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. అచ్చంపేట నియోజకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీఎల్ సంతోష్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని చెప్పుకొచ్చారు. అప్పట్లో బీఎల్ సంతోష్ ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు గువ్వల బాలరాజు.
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను మాత్రమే తాను పూర్తి చేశానని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకత్వం.. ప్రజల్లో బలం లేని రెడీమేడ్ లీడర్స్‌ను నమ్ముకుంటుందని వ్యాఖ్యానించారు. జనరల్ నియోజకవర్గాల్లో దళితులకు సీట్లు ఇచ్చే దమ్ము బీఆర్ఎస్‌కు ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏడాదిన్నర కాలంగా బీఆర్ఎస్‌లో తనకు ప్రాధాన్యం తగ్గించారని గువ్వల బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
గువ్వల బాలరాజు ఫోన్ కాల్ వైరల్..!
గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కార్యకర్తతో మాట్లాడినట్లుగా ఓ ఫోన్ కాల్ వైరల్ అవుతోంది. ఈ ఫోన్ కాల్‌లో ఏం మాట్లాడరంటే.. ‘బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని లేదా విలీనం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు మన అభ్యర్థిత్వం ఎగిరిపోతుంది. గతంలో బీజేపీతో నేను పోరాటం చేశా. బీఆర్ఎస్ కంటే ముందే నా దారి నేను చూసుకుని.. బీజేపీలో కలవడం మంచిదని నిర్ణయం తీసుకున్నా. పార్టీలో నన్ను కాదని నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ఇచ్చారు. ఆ విషయం ఎంతో బాధించింది’ అని గువ్వల బాలరాజు మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. వందే భారత్ టిక్కెట్లను బయలుదేరే 15 నిమిషాల ముందు వరకూ బుక్ చేసుకోవచ్చు
వర్షాకాలం..ఉతికిన బట్టలు వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ మర్చిపోకండి.!
Read latest Telangana News And Telugu News