AV Ranganath: కబ్జాలను ఉపేక్షించే ప్రసక్తే లేదు..
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:56 AM
లే అవుట్‌లను ప్రామాణికంగా తీసుకొని పార్కులు, రోడ్లు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జాదారుల చెర నుంచి కాపాడుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నివాస ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకతను అర్థం చేసుకొని వాటిని ఆక్రమించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాలనీలు, బస్తీల్లో పార్కులు ముఖ్యం: రంగనాథ్
‘హైడ్రా ప్రజావాణి’లో 58 ఫిర్యాదులు
హైదరాబాద్ సిటీ: లే అవుట్‌లను ప్రామాణికంగా తీసుకొని పార్కులు, రోడ్లు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జాదారుల చెర నుంచి కాపాడుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. నివాస ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకతను అర్థం చేసుకొని వాటిని ఆక్రమించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో జరిగిన ‘హైడ్రా ప్రజావాణి’లో పార్కులు, ఖాళీ స్థలాల కబ్జా, రోడ్ల ఆక్రమణ తదితర అంశాలపై 58 ఫిర్యాదులు అందాయి. గూగుల్ మ్యాప్, లే అవుట్లతోపాటు, ఎన్‌ఆర్‌ఎస్సీ, సర్వే ఆఫ్ ఇండియా శాటిలైట్ చిత్రాలు, గ్రామ రికార్డులను ఫిర్యాదుదారుల ముందే రంగనాథ్ ఆన్‌లైన్‌లో పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
- సికింద్రాబాద్ బోయిగూడ సమీపంలో 2వేల చ.గ. కురుమ శ్మశానవాటిక స్థలం ఆక్రమణలతో పూర్తిగా కనుమరుగవుతోంది. ఇంకా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొంటూ రాంగోపాల్‌పేట కార్పొరేటర్ చీర సుజాత ఫిర్యాదు చేశారు.
- బాచుపల్లిలోని శ్రీసాయికృష్ణ కాలనీలో 1700 చ.గల స్థలం కాపాడాలి. మునిసిపల్ అధికారులు కంచె వేస్తుండగా కబ్జాదారులు కోర్టుకు వెళ్లి పనులు నిలిపివేశారు. గతంలో ఈ స్థలం పార్కుగా ఉండేది. బతుకమ్మ ఉత్సవాలు జరిగేవి. రియల్టర్లు కబ్జాకు పాల్పడ్డారు.

- గండిపేట గ్రామ పంచాయతీలోని సర్వే నం.69లో లేఅవుట్ ప్రకారం ఉన్న 25అడుగుల రహదారిని కొందరు ఆక్రమించారు. ఆ స్థలంపై హక్కు మాదే అంటూ కొందరు భయపెడుతున్నారు.
- కుత్బుల్లాపుర్ భగత్‌సింగ్ నగర్‌లో 3,500 చదరపు గజాల స్థలం ప్రజావసరాలకు కేటాయించగా.. కబ్జాల పాలవుతోంది. స్థలం కాపాడేందుకు నిధులు విడుదలైనా పనులు జరగలేదు. కబ్జాదారుల నుంచి కాపాడితే ఆస్పత్రి నిర్మించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!
బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి
Read Latest Telangana News and National News