High Court: ఒక్క నేరానికి బహుళ కేసులు చెల్లవ్
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:45 AM
సీఎం రేవంత్ రెడ్డిని అగౌరవ పర్చడంతోపాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నమోదైన బహుళ కేసుల విచారణపై హైకోర్టు స్టే విధించింది.
కౌశిక్ రెడ్డిపై కేసుల విచారణ మీద హైకోర్టు స్టే
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డిని అగౌరవ పర్చడంతోపాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నమోదైన బహుళ కేసుల విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఒక ఎమ్మెల్యేగా.. సీఎంను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఫిర్యాదులపై వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఒక నేరానికి బహుళ కేసులు నమోదు చేయడం చెల్లదని కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ సారథ్యంలోని బెంచ్.. ఒకే నేరానికి బహుళ కేసులు నమోదు చేయడం చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయా కేసుల్లో తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించింది.. ఈ మేరకు వివరణ ఇవ్వాలని పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను 19కి వాయిదా వేసింది.