MLA: ఎమ్మెల్యే హెచ్చరిక.. ఆ పనులకు అడ్డురావొద్దు
ABN , Publish Date - Aug 05 , 2025 | 08:35 AM
నాగోల్ బండ్లగూడలో రామాలయ పునర్నిర్మాణ పనులను ప్రైవేటు వ్యక్తులు అడ్డుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. ఆలయ పునర్నిర్మాణపనులు చేపడుతుంటే పక్కనే ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి ఆలయం మధ్యలోంచి దారి వదలాలంటూ పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్: నాగోల్ బండ్లగూడలో రామాలయ పునర్నిర్మాణ పనులను ప్రైవేటు వ్యక్తులు అడ్డుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Devireddy Sudheer Reddy) హెచ్చరించారు. ఆల య పునర్నిర్మాణపనులు చేపడుతుంటే పక్కనే ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి ఆలయం మధ్యలోంచి దారి వదలాలంటూ పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వారి విన్నపం మేరకు సోమవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
అందుకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన అధికారులు ప్రైవేటు వ్యక్తి వద్ద ఉన్న పత్రాలు నకిలీవిగా తేల్చిచెప్పారు. అదేవిధంగా ఇటీవల రజక, హిందూ శ్మశానవాటిక వద్ద గల సుమారు వంద గజాల స్థలం కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను అధికారులు కూల్చివేయ గా మళ్లీ ఇదే వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్నారని బండ్లగూడ గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు కబ్జాకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని, కబ్జా చేయకుండా అట్టి స్థలంలో వెంటనే ప్రహరీ నిర్మించాలని అధికారులకు సూచించారు.

ఆలయ కమిటీ సభ్యులు ఎలాంటి రోడ్డుకు స్థలం వదలకుండా నిర్భయంగా రామాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ విజయలక్ష్మి, బీఆర్‌ఎస్ నాగోల్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్‌గౌడ్, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!
బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి
Read Latest Telangana News and National News