MLC Teenmar Mallanna: 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేపట్టండి
ABN , Publish Date - Aug 05 , 2025 | 09:48 AM
సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావులకు చిత్తశుద్ధి ఉంటే 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేయాలని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) డిమాండ్ చేశారు.
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావులకు చిత్తశుద్ధి ఉంటే 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేయాలని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) డిమాండ్ చేశారు. ఈ విషయమై అన్ని పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లకు అడ్డు ఎవరూ లేరని, కాని ఈ మూడు పార్టీలు నయా నాటకానికి తెరతీస్తున్నాయన్నారు.
తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్.. 42 శాతం రిజర్వేషన్ పేరుతో అసెంబ్లీ, మండలిలో బిల్లు పెట్టి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిందని, మళ్లీ ఆర్డినెన్స్ అంటున్నారని విమర్శించారు. విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్ అంశమే లేదని, కేవలం స్థానిక సంస్థల ఎన్నికల అంశమే ఉందన్నారు.

నిరుద్యోగుల నిలదీత
సమావేశం ముగిసే సమయంలో పలువురు నిరుద్యోగులు, డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తమ సమస్యల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్సీని ప్రశ్నించారు. వెంటనే పోలీసులు స్పందించి ఆయనను, వారిని అక్కడి నుంచి పంపించివేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!
బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి
Read Latest Telangana News and National News