ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amritsar: పాత వీడియోలతో పాకిస్తాన్ అక్కసు.. సైనిక స్థావరంపై దాడి చేశామంటూ..

ABN, Publish Date - May 08 , 2025 | 01:45 PM

భారత గడ్డపై పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడిందని కట్టుకథలు అల్లుతూ పాకిస్తాన్ మీడియాలో అసత్య వార్తలను ప్రసారం చేస్తోంది. ఈ క్రమంలోనే అమృత్‌సర్‌లోని సైనిక స్థావరంపై పాకిస్తాన్ దాడికి పాల్పడిందంటూ వార్తలు ప్రచురించింది. ఇందుకు సంబంధించి..

ఆపరేషన్ సింధూర్.. పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్.. ఎదో ఒక రూపంలో కసి తీర్చుకోవాలనే ఉద్దేశంతో సరిహద్దు గ్రామాల ప్రజలపై కాల్పులకు తెగబడుతోంది. అయితే పాక్ ఆర్మీ కాల్పులకు భారత ఆర్మీ దీటుగా బదులిస్తోంది. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. అమృత్‌సర్‌లోని భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసిందంటూ వార్తలు ప్రచురించింది. దీనిపై భారత పీఐబీ అధికారులు క్లారిటీ ఇచ్చారు.


భారత గడ్డపై పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడిందని కట్టుకథలు అల్లుతూ పాకిస్తాన్ మీడియాలో (Pakistani media) అసత్య వార్తలను ప్రసారం చేస్తోంది. ఈ క్రమంలోనే అమృతసర్‌లోని (Amritsar) సైనిక స్థావరంపై దాడి చేసిందనే పాకిస్తాన్ దాడికి పాల్పడిందంటూ వార్తలు ప్రచురించింది. ఇందుకు సంబంధించి ఓ నకిలీ వీడియోను కూడా సోషల్ మీడియాలో వైరల్ అచేసిది. అయితే దీనిపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అవన్నీ తప్పుడు వార్తలేనని, సైనిక స్థావరంపై ఎలాంటి దాడులూ జరగలేదని స్పష్టం చేసింది. ఆ వీడియో 2024లో అడవిలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించినదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ధృవీకరించింది.


పీఐబీ అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్టును షేర్ చేశారు. ‘‘అమృత్‌సర్‌లోని సైనిక స్థావరంపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ పాకిస్తాన్‌కు చెందిన హ్యాండిల్స్ పాత వీడియోలను తప్పుగా వ్యాప్తి చేస్తున్నాయి. ఆ వీడియో 2024 నాటి కార్చిచ్చుకు సంబంధించింది’’.. అని ప్రస్తావిస్తూ పోస్టును షేర్ చేసింది. మరోవైపు అమృత్‌సర్‌లో బుధవారం రాత్రి 1:45 గంటల ప్రాంతంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై బ్లాక్‌అవుట్ విధించాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు శ్రీగురు రామ్‌దాస్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్‌ను ఖాళీ చేయించారు.


భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్‌ రాష్ట్రాల్లో హై అలర్ట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేయడంతో పాటూ సెలవులో ఉన్న అధికారులను కూడా రప్పిస్తున్నారు. మరోవైపు ఎల్‌ఓసి వెంబడి పాకిస్తాన్ ఫిరంగి దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ముగ్గురు పౌరులు మరణించారు. పాకిస్తాన్ కాల్పులకు భారత్ కూడా దీటుగా సమాధానం చెబుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..

పాక్ కవ్వింపు చర్యలు.. తిప్పికొట్టిన భారత్ సైన్యం..

న్యాయం జరిగింది: సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం

For More AP News and Telugu News

Updated Date - May 08 , 2025 | 03:51 PM