Today Gold Rate: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..
ABN , Publish Date - May 08 , 2025 | 07:23 AM
Today Gold Rate: గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి.

బిజినెస్ న్యూస్: బంగారం (Gold), వెండి (Silver)కి మార్కెట్ (Market)లో ఎప్పుడూ డిమాండ్ (Demand) ఉంటుంది. గత కొంత కాలం నుంచి గోల్డ్, సిల్వర్ ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి (Record Level) చేరుకుంటున్నాయి. ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరి కొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి. గత మూడు నాలుగు రోజుల నుంచి గోల్డ్, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి.
పసిడి లక్ష రూపాయలు దాటింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మరో రూ.1,000 పెరిగి రూ.1,00,750కి చేరింది. 99.5 శాతం స్వచ్ఛత లోహం సైతం రూ.1,050 పెరుగుదలతో రూ.1,00,350కి ఎగబాకింది. కిలో వెండి కూడా రూ.440 పెరిగి రూ.98,940 ధర పలికింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గించనుందన్న అంచనాలతో అంతర్జాతీయంగా వీటి ధరలు మళ్లీ ఎగబాకడం, భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి దేశీయంగా డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 3,369 డాలర్లు, వెండి 32.81 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.
Also Read: చైనా.. ఆచితూచి
కాగా గోల్డ్ ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. తాజాగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 90,760గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 99,010గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..
కోల్‌కతా- రూ.90,760, రూ.99,010
చెన్నై- రూ.90,760, రూ.99,010
బెంగళూరు- రూ.90,760, రూ.99,010
పుణె- రూ.90,760, రూ.99,010
అహ్మదాబాద్- రూ.90,810, రూ.99,060
భోపాల్- రూ.90,810, రూ.99,060
కోయంబత్తూర్- రూ.90,760, రూ.99,010
పట్నా- రూ.90,810, రూ.99,060
సూరత్- రూ.90,810, రూ.99,060
పుదుచ్చెరి- రూ.90,760, రూ.99,010
బంగారం స్వచ్ఛమైనదా కాదా, ఇలా చెక్ చేయండి
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) హాల్ మార్కులను ఇస్తుంది. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో రాగి, వెండి, జింక్ వంటి 9% ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 22 క్యారెట్ల బంగారం 0.916 స్వచ్ఛతను కలిగి ఉండాలి (22/24 = 0.916). 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999 అని, 23 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 958 అని, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 916 అని, 21 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 875, 18 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 750 అని రాసి ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి కల్తీ ఉండదు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News