China Pakistan Relations: చైనా.. ఆచితూచి
ABN , Publish Date - May 08 , 2025 | 05:27 AM
పహల్గాం దాడి అనంతరం పాక్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చే విషయంలో చైనా ముందడుగు వేయక ఆచితూచి వ్యవహరిస్తోంది. సీపీఈసీపై ముప్పు, భారత్‌తో వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశాలు చైనా ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి.
సర్వకాల సర్వావస్థల్లో పాకిస్థాన్‌ను వీడని చైనా.. పహల్గాం దాడి తర్వాత మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. భారత్-పాక్ యుద్ధం జరిగితే తనకే నష్టమని ఆందోళన చెందుతోంది. ఎందుకంటే చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)లో తన ఆస్తులు, పెట్టుబడులకు ముప్పు ఏర్పడుతుందని భయపడుతోంది. బలూచిస్థాన్‌లో తిరుగుబాటుదారులు ఇటీవలి కాలంలో క్రియాశీలమవడం, ఏకంగా పాక్ సేనలపైనే దాడులు చేస్తుండడం.. కారిడార్ పనుల్లో నిమగ్నమైన చైనా సిబ్బందిని టార్గెట్ చేయడంతో.. చైనా ప్రభుత్వం తొలిసారి తన ప్రాజెక్టుల రక్షణకు ప్రైవేటు భద్రతాసిబ్బందిని మోహరించింది. ఇంకోవైపు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. చైనా వస్తువులపై ఎడాపెడా భారీ సుంకాలు విధిస్తున్నారు. దీంతో చైనా ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో పాక్‌కు సంపూర్ణ మద్దతిస్తే.. అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్‌ను మరింత దూరం చేసుకున్నట్లవుతుందని.. ప్రస్తుత టారిఫ్ యుద్ధ సమయంలో ఇది సరికాదని చైనా నాయకత్వం భావిస్తోంది. పైగా వాస్తవాధీన రేఖ వెంబడి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మళ్లీ ఉద్రిక్తతలతో మొదటికే మోసం వస్తుందని అంచనా వేస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News